క్రమం తప్పుకుండా తరగతులకు హాజరు కావాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: యూనివర్సిటీ పీజీ కళాశాల మొదటి సంవత్సరం వివిధ విభాగాల తరగతులను పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొ.రమేశ్‌బాబు సందర్శించారు. శుక్రవారం తరగతులను కలియ తిరుగుతూ విద్యార్థులను సిలబస్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్లాసులకు క్రమం తప్పుకుండా హాజరు కావాలని సూచించారు. ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించి మెడిసినల్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. బీఫార్మసీ, మొదటి సంవత్సరం, డీఫార్మసీ పరీక్షలను తనిఖీ చేశారు.
మహిళా హాస్టల్‌లో డైనింగ్ హాల్ ప్రారంభం
క్యాంపస్‌లో మహిళా హాస్టల్‌లో డైనింగ్ హాల్‌ను వీసీ శ్రీనివాస్ ప్రారంభించారు.విద్యార్థులు మంచి ఆరోగ్యంతో చదువుకునేందుకు పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని సూచించారు. ఆహారంలో ఆకుకూరలు, రాగి జావా, చపాతి, ఎక్కువగా తీసుకోవాలన్నారు. డైనింగ్ హాల్ పరిసరాలలో శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ప్రిన్సిపాల్ డా.డి.మధుసూదన్‌రెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ డా.నూర్జహాన్, అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ డా.చంద్రకిరణ్, పరీక్షల నియంత్రణ అధికారి కె.ప్రవీణ, హెచ్‌ఓడీలు పాల్గొన్నారు.


