కార్మికుల హక్కులను కాపాడుకుందాం
గద్వాలన్యూటౌన్: కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. లేబర్ కోడ్స్, వీబీజీ రామ్‌జీ చట్టం, జాతీయ విత్తన చట్టం, విద్యుత్ సవరణ బిల్లుల రద్దు తదితర విధానాలను నిరసిస్తూ.. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు గురువారం చేపట్టిన దేశవ్యాప్త సమ్మె జిల్లాకేంద్రంలో విజయవంతమైంది. ఈ సందర్భంగా వివిధ విభాగాల కార్మిక, రైతు సంఘాలతో పాటు విద్యుత్, బ్యాంకింగ్, ఎల్‌ఐసీ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సీఐటీయూ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ వద్ద నిర్వహించిన సభలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. కార్మికుల ఉపాధి, భద్రత, జీవనాధారాలను దెబ్బతీసేలా తీసుకొచ్చిన లేబర్ కోడ్స్, ఉపాది కూలీలకు నష్టం కలిగించే విబీజీ రామ్‌జీ చట్టం, జాతీయ విత్తన చట్టం, విద్యత్ సవరణ బిల్లుల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాల్లో సీఐటీయూ జిల్లా అద్యక్షుడు ఉప్పేర్ నర్సింహ, కృష్ణ, కార్తీక్, గోపాల్, ప్రభాకర్, ఆశన్న, విద్యుత్ డీఈ నాగరాజు, ఈడీఈ కురుమూర్తి, రహీం, ఐసీఈయూ బ్రాంచ్ అద్యక్షుడు నర్సింగ్, ప్రధాన కార్యదర్శి రంగారావు, మల్లిఖార్జున్, రంగయ్య, యూబీఐ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు పరుశరాం, రామాచారి, రవి పాల్గొన్నారు.
మన్యంకొండ ఆదాయం రూ.37.64 లక్షలు
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం హుండీ ఆదాయం రూ.37,64,907 ఆదాయం వచ్చింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం ఈ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ లెక్కింపు సాయంత్రం 7 గంటలకు సాగింది. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, ఇన్‌స్పెక్టర్ వీణ, ఐడీబీఐ మేనేజర్ మల్లిఖార్జున్, సత్యసాయి సమితి, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.
కార్మికుల హక్కులను కాపాడుకుందాం


