గణతంత్ర వేడుకలకు ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

గణతంత్ర వేడుకలకు ముస్తాబు

Jan 26 2026 4:59 AM | Updated on Jan 26 2026 4:59 AM

గణతంత్ర వేడుకలకు ముస్తాబు

గణతంత్ర వేడుకలకు ముస్తాబు

గద్వాల: గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఆదివారం కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూడురంగుల జెండాలు, విద్యుత్‌దీపాలతో అలంకరించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక పరేడ్‌గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం 8:55 గంటల నుంచి 8:57 గంటల వరకు ముఖ్య అతిథికి గౌరవవందనం, 9గంటల నుంచి 9:05గంటల వరకు పతాకావిష్కరణ, 9:06గంటల నుంచి 9:16 గంటల వరకు కలెక్టర్‌ బీఎం సంతోష్‌ సందేశం, 9:17గంటల నుంచి 9:40 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 9:41 గంటల నుంచి 10 గంటల వరకు వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు ప్రశంసా పత్రాలు అందజేత, 10:01గంటల నుంచి 10:30 గంటల వరకు వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ సందర్శన కార్యక్రమాలు ఉంటాయని అదనపు కలెక్టర్‌ వి.లక్ష్మీనారాయణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement