శాంతియుత వాతావరణంలో..
మున్సిపల్ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా అల్లర్లు, దాడులు, హింసత్మక ఘటనలకు ప్రేరేపిస్తే సహించేది లేదు. ప్రత్యేక బృందాలు నిత్యం తనిఖీలు చేపడుతున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే చర్యలు తప్పవు. పాత నేరస్తులను ముందుస్తుగా బైండోవర్ చేశాం. నామినేషన్ కేంద్రాలను సైతం తనిఖీలు చేశాం. అవసరమైతే పదో బెటాలియం సిబ్బంది సహాయంతో భద్రత చర్యలు కట్టుదిట్టం చేస్తాం. 13 వరకు కోడ్ అమల్లో ఉంటుంది. ర్యాలీలు, సభలు నిర్వహించాలంటే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. – శ్రీనివాసరావు, ఎస్పీ
●


