సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

సర్వం సిద్ధం

Feb 2 2026 7:25 AM | Updated on Feb 2 2026 7:25 AM

సర్వం

సర్వం సిద్ధం

నేటి నుంచి ఇంటర్మీడియట్‌ ప్రయోగ పరీక్షలు

సీసీ కెమెరాల పర్యవేక్షణ

23 కేంద్రాల ఏర్పాటు

అన్ని ఏర్పాట్లు చేశాం

రెండు విడతలుగా జరిగే ప్రయోగ పరీక్షలకు జిల్లా పరిధిలోని అన్ని కళాశాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంటర్‌ బోర్డు నిర్ణయం మేరకు సీసీ కెమెరాలు ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. దీనిద్వారా ప్రయోగ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించే వెసులుబాటు ఉంది. ఫలితంగా ప్రతిభ ఉన్న విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. బోర్డు ద్వారా నియమితులైన ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్ల ద్వారా పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలి.

– హృదయరాజు, డీఐఈఓ, గద్వాల

గద్వాలటౌన్‌: ఇంటర్మీడియట్‌ ప్రయోగ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమవనున్న నేపథ్యంలో అందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కళాశాలల్లో అన్ని వసతులు ఉండి కెమెరాలు బిగించిన వాటికే పరీక్ష కేంద్రాలుగా అనుమతి ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కలిపి మొత్తం 43 జూనియర్‌ కళాశాలల్లో మొత్తం 3,925 మంది విద్యార్థులు చదువుతుండగా.. 23 పరీక్ష కేంద్రాలను గుర్తించారు. 50 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉన్న కళాశాలల విద్యార్థులకు సమీపంలో ఉన్న కళాశాలలకు మార్చారు. సైన్స్‌ గ్రూపుల్లో ఎంపీసీ విద్యార్థులు భౌతిక, రసాయన శాస్త్రాలు.. బైపీసీ విద్యార్థులు భౌతిక, రసాయన శాస్త్రంతో పాటు జంతు, వృక్ష శాస్త్రాల్లో ప్రయోగాలు చేయించాల్సి ఉంటుంది. ఒక్కో సబ్జెక్టుకు 30 మార్కులు ఉంటాయి.

రెండు విడతల్లో...

జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు, రెండో విడత ఈ నెల 7వ నుంచి 11వ తేదీ వరకు ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.

జిల్లా కేంద్రం నుంచి నేరుగా పర్యవేక్షణ

పరీక్షల నిర్వహణకు ప్రయోగశాలల్లో సీసీ కెమెరాలు బిగించి ఐపీ అడ్రస్‌ నమోదు చేసినందున జిల్లాలోని వివిధ కళాశాలల్లో నిర్వహించే ప్రయోగ పరీక్షలను జిల్లా ఇంటర్‌ విద్యాధికారితో పాటు ఇంటర్‌ బోర్డు అధికారులు నేరుగా పర్యవేక్షించే వెసులుబాటు కలగనుంది. ప్రతీసారి స్క్వాడ్‌ బృందాలతో తనిఖీలు చేయించాల్సిన అవసరం లేదు. మరోవైపు పరీక్ష కేంద్రాలపై ఏదైనా ఫిర్యాదు వస్తే సీసీ కెమెరాల ద్వారా డిజిటల్‌ వీడియో రికార్డర్‌లో మొత్తం రికార్డు కానుండటంతో పరిశీలించే వెసులుబాటు ఉంటుంది.

వెంటనే మార్కుల నమోదు

ప్రయోగ పరీక్షలు ముగిసిన వెంటనే మూల్యాంకనం చేసిన మార్కులను ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌లో అప్పటికప్పుడు నమోదు చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ప్రయోగ పరీక్షల నిర్వహణకు కావాల్సిన ప్రశ్నాపత్రాలు కూడా పరీక్ష సమయానికి ఆన్‌లైన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిద్వారా ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

– వివరాలు IIలో..

జూనియర్‌ కళాశాలలు 43

జనరల్‌

విద్యార్థులు 2,327

ఓకేషనల్‌

విద్యార్థులు (ద్వితీయ) 714

ఓకేషనల్‌

విద్యార్థులు (ప్రథమ) 884

జనరల్‌ విద్యార్థులకు కేంద్రాలు : 14

ఓకేషనల్‌ విద్యార్థులకు కేంద్రాలు : 09

జిల్లా వ్యాప్తంగా..

జనసంద్రం.. మన్యంకొండ

గోవింద నామస్మరణతో మార్మోగిన గిరులు

ఒక్కరోజే స్వామివారిని దర్శించుకున్న లక్ష మంది భక్తులు

రథోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసిన దేవాదాయ శాఖ అధికారులు

సర్వం సిద్ధం 1
1/2

సర్వం సిద్ధం

సర్వం సిద్ధం 2
2/2

సర్వం సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement