జములమ్మ బ్రహ్మోత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

జములమ్మ బ్రహ్మోత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు

Jan 24 2026 7:27 AM | Updated on Jan 24 2026 7:27 AM

జములమ్మ బ్రహ్మోత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు

జములమ్మ బ్రహ్మోత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు

గద్వాల: జములమ్మ బ్రహ్మోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో ఈ నెల 27 నుంచి ప్రారంభమవుతున్న జమ్ములమ్మ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో వేలాది సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, బారికేడ్లు ఏర్పాటు చేసి క్యూలైన్‌ సక్రమంగా నిర్వహించాలన్నారు. భక్తులకు తాగునీటి వసతి, మరుగుదొడ్లు, పరిశుభ్రతకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్‌ నిర్వహణ, భద్రత పార్కింగ్‌ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఎమర్జెన్సీ సేవలను అందుబాటులో ఉంచాలని, ఆలయ ప్రాంగణంలో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు చెప్పారు. వైన్‌షాపుల దగ్గర ఎలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ఎక్సెజ్‌ అధికారులకు సూచించారు. నీటి ప్రమాదాలు జరిగితే గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, జమ్ములమ్మ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పురేందర్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి షకీలాభాను, తహసీల్దార్‌ మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి

ప్రజాస్వామంలో 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం అధికారులతో స్వీప్‌ నోడల్‌ అధికారి రమేష్‌బాబు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటుహక్కు ప్రాధాన్యత తెలియజేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement