వేరుశనగ @ రూ.9,389 | - | Sakshi
Sakshi News home page

వేరుశనగ @ రూ.9,389

Jan 25 2026 7:06 AM | Updated on Jan 25 2026 7:06 AM

వేరుశనగ @ రూ.9,389

వేరుశనగ @ రూ.9,389

రోజురోజుకూ పెరుగుతున్న ధరలు
నాణ్యతను బట్టి ధర

ఈసారి రికార్డు స్థాయిలో పెరుగుదల

మద్దతుకు మించి ఎగబాకుతున్న వైనం

గద్వాల మార్కెట్‌కు భారీగా రాక

జిల్లాలో ఊపందుకున్న దిగుబడులు

గద్వాల వ్యవసాయం: జిల్లాలో పల్లీ ధరలు రోజురోజుకూ ఎగబాకుతున్నాయి. రైతులు యాసంగి సీజన్‌కు ముందుగా వేరుశనగ వేయగా.. పంట చేతికి రావడంతో విక్రయానికి గడిచిన మూడు నెలల నుంచి గద్వాల మార్కెట్‌ యార్డుకు తీసుకువస్తున్నారు. ఇలా వస్తున్న వేరుశనగకు అక్టోబర్‌ నుంచి జనవరి వరకు పోల్చితే నెలనెలా రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. ఈ సీజన్‌లో గరిష్టంగా రూ.9,389 ధర పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన వానాకాలం సీజన్‌లో అధిక వర్షాల వల్ల వేరుశనగ బాగా దెబ్బతినడంతో కొన్నిచోట్ల పంటను తీసివేశారు. జిల్లాలో పలుచోట్ల అనుకున్న స్థాయిలో దిగుబడులు రాలే దు. అయితే విస్తారంగా కురిసిన వర్షాల వల్ల బోర్లు, బావులు రీచార్జి అయ్యాయి. దీంతో ఆగస్టు, సెప్టెంబర్‌లో దాదాపు 7–10 వేల ఎకరాల్లో ముందస్తుగా యాసంగి సీజన్‌లో భాగంగా మల్దకల్‌, కేటీదొడ్డి, గట్టు, గద్వాల, ఇటిక్యాల, అయిజ మండలాల్లో పంట సాగు చేశారు. ఇలా వేసిన వేరుశనగ పంట అక్టోబర్‌ నుంచి యార్డుకు అమ్మకానికి వస్తోంది.

బోరుబావులు, అందుబాటులో ఉన్న నీటివనరుల కింద వేరుశనగను సాగు చేశారు. అయితే దిగుబడులు ఎక్కువగా రాకున్నా గింజ బాగా గట్టిగా, లావుగా ఉంది. దీంతో చేతికి వచ్చిన వేరుశనగను బాగా ఆరబెట్టి, మట్టి పెల్లలు, దుమ్ము, ధూళి లేకుండా రైతులు తీసుకొస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఈ సమయంలో వేరుశనగ యార్డులకు రావడం లేదు. దీంతోపాటు ఇక్కడి నుంచి చైన్నె, మహారాష్ట్రకు ఎగుమతి అవుతోంది. ఫలితంగా ఇక్కడ వేరుశనగకు మంచి ధరలు రావడంతోపాటు పెరుగుతున్నాయి. బాగా ఆరబెట్టి తీసుకొస్తుండటంతోపాటు సరుకు నాణ్యతగా ఉంటుండటంతో వ్యాపారులు మంచి ధరలు కోడ్‌ చేస్తున్నారు.

ఈ సీజన్‌లో వేరుశనగ క్వింటాకు లభించిన ధరలు ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement