75% మున్సిపాలిటీలు గెల్చుకుంటాం | - | Sakshi
Sakshi News home page

75% మున్సిపాలిటీలు గెల్చుకుంటాం

Feb 12 2026 1:21 PM | Updated on Feb 12 2026 1:21 PM

75% మున్సిపాలిటీలు  గెల్చుకుంటాం

75% మున్సిపాలిటీలు గెల్చుకుంటాం

కొల్లాపూర్‌: రాష్ట్రవ్యాప్తంగా 75 శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్‌ పార్టీ గెల్చుకుంటుందని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కొల్లాపూర్‌లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆ మాట్లాడుతూ కొల్లాపూర్‌ మున్సిపాలిటీని క్లీన్‌స్వీప్‌ చేస్తామన్నారు. గత పాలకుల అవినీతికి ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజామోదం లభిస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలో కాంగ్రెస్‌దే పై చేయిగా నిలుస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement