సమష్టి కృషితో సాధ్యం
చిన్నారులను కుటుంబ స భ్యులే ఉన్నత లక్ష్యాల వైపు పయనించేలా చర్యలు తీసుకోవాలి. చదువుకోవడం వల్ల ఉండే ప్ర యోజనాలను చిన్నారులకు వివరించాలి. ప్రభుత్వం బాల కార్మికులను గుర్తించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ అందించి వారి పిల్లల భవిష్యత్‌కు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆర్థిక పరిస్థితులు, సమస్యల కారణంగా కుటుంబ సభ్యులే చిన్నారులను మళ్లీ పనులకు పంపిస్తున్నారు. ప్రభుత్వంతో పౌరుల సమష్టి కృషితో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించొచ్చు.
– శ్రీనివాసరావు, ఎస్పీ


