వెట్టి నుంచి విముక్తి
బాలకార్మిక వ్యవస్థపై నిఘా..?
కఠిన చర్యలు
ఆపరేషన్ స్మైల్‌తో 59 మంది బాలల గుర్తింపు
● పనుల్లో పెట్టుకున్న యజమానులపై కేసులు నమోదు
● బాల కార్మిక వ్యవస్థపై నిఘా
● అధికారుల సమష్టి కృషితోనే సాధ్యం
గద్వాల క్రైం: ఒక వైపు సాంకేతిక విజ్ఞానం వైపు వి ద్యార్థులు పరుగులు పెడుతున్నా.. మరికొన్ని స్థాయి ల్లో చిన్నారులు బాల కార్మికులుగా హోటళ్లు.. మోకానిక్ షాపులు.. ఇటుక బట్టీలు.. వ్యవసాయ పొల్లాలో.. గొర్రెల కాపారులుగా మగ్గిపోతున్నారు. విద్యాలయాల్లో ఉండాల్సిన చిన్నారులు తల్లిదండ్రుల నిర్లక్ష్యం.. ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగా ఉండడంతో నిరాక్ష్యరాస్యులుగా మారి బాల కార్మిక వ్యవస్థ కో రల్లో చిక్కుకుపోతున్నారు. ఈ వ్యవస్థను పూర్తి స్థాయి లో నిర్మూలించాలనే లక్ష్యంతో పోలీసు, కార్మిక, విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ప్రభు త్వం చేపట్టిన ఆపరేషన్ స్మైల్‌లో భాగస్వాములయ్యా రు. జనవరి 1 నుంచి 31 వరకు గద్వాల, అలంపూర్ సెగ్మెంట్లలో జిల్లావ్యాప్తంగా పలు బృందాలుగా వీడి పోయి 59 మంది బాల కార్మికులను గుర్తించి, వారిని పాఠశాలలకు పంపించారు. చిన్నారులను పనిలో పెట్టుకున్న యజమానులపై పోలీసుశాఖ, కార్మిక శాఖ అధికారులు 49 కేసులు నమోదు చేశారు.
మెకానిక్ షాపులు, కిరాణాలు, హోటళ్లు, బట్టల దుకాణం, ఇట్టుక బట్టీలు తదితర ప్రదేశాలల్లో చిన్నారులను పనుల్లో పెట్టుకుంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని అధికారులు హెచ్చరించారు. చిన్నారులకు విద్య అనేది ప్రాథమిక హక్కు అని, ఎవరూ కాలరాయొద్దని సూచించారు. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రతి సంవత్సరం బాల కార్మికులను గుర్తించి పాఠశాలలు, ఆర్బీసీ సెంటర్లలో చేర్పించడంతోనే అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. కొన్ని రోజుల తర్వాత వారు తిరిగి పనులు చేసేందుకు వెళ్తున్నారు. నిరంతరం బాలలపై నిఘా లేకపోవడం సమస్యగా మారుతోంది. జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు చేపట్టి పనులు చేస్తున్న చిన్నారులను గుర్తిస్తున్నారే తప్పా.. నిరంతరం నిఘా ఉండడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ సభ్యులే చిన్నారులను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి పనులు చేయిస్తున్నారు.


