ముగిసిన చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు

Feb 6 2026 7:09 AM | Updated on Feb 6 2026 7:09 AM

ముగిసిన చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు

ముగిసిన చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు

సంప్రదాయబద్ధంగా

సుదర్శన ‘చక్ర’ స్నానం

ఉత్సవమూర్తుల ఊరేగింపు

గద్వాలటౌన్‌: పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య బుధవారం భూలక్ష్మీచెన్నకేశవస్వామి సుదర్శన చక్రస్నానం సంప్రదాయబద్ధంగా చేయించా రు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గద్వాల కోటలోని ఆ లయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి సన్నిధానంలో నిత్యపూజ కార్యక్రమాల అనంతరం స్వామివారికి అవబృత స్నానం గావించారు. ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకం, సత్యనారాయణ స్వామి పూజ కార్యక్రమం నిర్వహించారు.

అశ్వవాహనంపై..

శ్రీ భూలక్ష్మీచెన్నకేశవస్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి సాయంత్రం అశ్వవాహనంపై ఊరేగించారు. చెన్నకేశవస్వామి ఆలయం నుంచి పురవీధుల గుండా పెద్ద అగ్రహరంలోని అహోబిలమఠం వరకు ఊరేగింపు కొనసాగింది. మఠంలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పూజలు నిర్వ హించి తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. భజనలు చేస్తూ, భక్తీ గీతాలు ఆలపిస్తు భక్తులు ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం నాగవళి, దేవత విసర్జన, సర్వసమర్పణోత్సవ పూజలతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కార్యక్రమంలో ఆలయ విచారణ కర్త ప్రభాకర్‌, మేనేజర్‌ శ్రీపాదజోషి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement