ప్రజావాణి రద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి రద్దు

Feb 1 2026 3:17 AM | Updated on Feb 1 2026 3:17 AM

ప్రజా

ప్రజావాణి రద్దు

గద్వాల: మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ బీఎం సంతోష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజావాణిని యథావిధిగా కొనసాగిస్తామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.

సమాజంపై విద్యార్థులకు అవగాహన

గద్వాల: ప్రభుత్వ కాలేజీలలో చదువుకోవడంతో విద్యార్థులకు సమాజం పట్ల అన్ని రకాల అవగాహన ఏర్పడుతుందని దీంతో విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తారని అదనపు కలెక్టర్‌ వి.లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు నిర్వహించిన ఫేర్‌వెల్‌ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ కళాశాల విద్యార్థులు అత్యధికంగా వెనకబడిన, నిరుపేద కుటుంబాల నుంచి వస్తారని, చదువుతోపాటు సమాజం పట్ల కూడా పూర్తిగా అవగాహన ఏర్పడుతుందన్నారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న నాతో సహా ప్రభుత్వ ఉద్యోగులందరూ అదే వర్గానికి చెందినవారమన్నారు. కార్యక్రమంలో ఏజీఎంసీ బండ్ల దేవేందర్‌రెడ్డి, గండిచెరువు శేఖర్‌, పవన్‌కుమార్‌, కలీముల్లా, సృజన, గీత, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు నిబంధనలు తప్పనిసరి

గద్వాల క్రైం: ప్రతిఒక్కరు రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఇన్‌చార్జి రవాణాధికారి కృష్ణారెడ్డి అన్నారు. శనివారం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించిన రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సీటు బెల్టు, హెల్మెట్‌, ఇన్సూరెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌తోపాటు సామర్థ్యం కలిగిన వారు మాత్రమే రోడ్డు ప్రయాణాలు చేయాలన్నారు. మద్యం, సెల్‌ఫోన్‌, నిద్రలేమి కారణాలతో డ్రైవింగ్‌ చేయడం ద్వారా ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుందన్నారు. అనంతరం ప్రైవేట్‌ డ్రైవర్లకు ఉచిత హెల్త్‌ క్యాంపు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సిబ్బంది రాములు, రమేష్‌, రుక్మాత్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణి రద్దు 
1
1/1

ప్రజావాణి రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement