దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు
గద్వాల: దివ్యాంగులకు ఉచితంగా అందించే సహాయ ఉపకరణాల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసీఆర్ చప్పల్స్, స్మార్ట్ కేన్స్, వాకింగ్ స్టిక్స్, క్రచెస్, హియరింగ్ ఎయిడ్‌లు, వీల్ చైర్లు, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిల్స్, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ట్యాబ్ లు, డిగ్రీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు ఈ నెల 30వ తేదీలోగా httpr.obmm r.cff. gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు సదరం సర్టిఫికెట్, ఆధార్, విద్యార్హత పత్రాలు, ఆదాయం, రేషన్‌కార్డు జిరాక్స్ జతచేసి కలెక్టరేట్‌లో ని మహిళా శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ కార్యాలయంలో 31వ తేదీలోగా సమర్పించాలని తెలిపారు. వివరాలకు 77998 66325 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: జిల్లాలోని మహిళా రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం కంపెనీలో కాంట్రాక్టు విధానంలో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలంపూర్‌లోని బాలబ్రహ్మేశ్వర ఉమెన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలో సీఈఓ, అకౌంటెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీఈఓ పోస్టుకు బీఎస్సీ అగ్రికల్చర్ లేదా మార్కెటింగ్ లేదా ఎంబీఏ మార్కెటింగ్, బీబీఏ ఏదైనా విద్యార్హత కలిగి ఉండాలన్నారు. ప్రతినెలా జీతం రూ.15వేలు ఉంటుందన్నారు. అదే విధంగా అకౌంటెంట్ పోస్టుకు బీకాం విద్యార్హత ఉండాలని, జీతం రూ. 6వేలు ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు 87909 90641, 87909 90593 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
అధిక వసూళ్లకు పాల్పడితే చర్యలు
కేటీదొడ్డి: మీసేవ కేంద్రాల నిర్వాహకులు అంకితభావంతో పనిచేయాలని.. ప్రభుత్వం నిర్దేశించిన రుసుము కంటే అధికంగా వసూళ్లు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ–జిల్లా మేనేజర్ (ఈడీఎం) శివ అన్నారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు నందిన్నెలోని మీసేవ, ఆధార్ నమోదు కేంద్రాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో సిటిజన్ చార్ట్, నోటీస్ బోర్డులను పరిశీలించడంతో పాటు సర్టిఫికెట్ల దరఖాస్తు కోసం వసూళ్లు చేస్తున్న రుసుముపై ఆరా తీశారు. మీసేవ కేంద్రాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈడీఎం మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందించడమే మీసేవ కేంద్రాల లక్ష్యమని అన్నారు. కేంద్రాల నిర్వాహకులు ఆన్‌లైన్ లవాదేవీలను రికార్డు చేయాలని సూచించారు. ఈడీఎం వెంట డీఎం సుధాకర్‌రెడ్డి, మీసేవ కేంద్రాల నిర్వాహకులు సురేశ్, మౌలాలి, వెంకటేశ్, రవిబాబు ఉన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
గద్వాల క్రైం: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు మంగళవారం గద్వాల ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ, డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గిరిరాజు, రాంనాథ్, పరుశరాములు, సూరిబాబు, సురేశ్, శ్రీధర్‌గౌడ్, గోవిందరాజు, నాగరాజు పాల్గొన్నారు.
23న సామూహిక అక్షరాభ్యాసం
ఎర్రవల్లి: వసంత పంచమిని పురస్కరించుకొని ఈ నెల 23న బీచుపల్లి క్షేత్రంలోని జ్ఞానసరస్వతి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొనే వారు రూ.వెయ్యి చెల్లించి తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు.
దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు


