జలసంరక్షణ పనులకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

జలసంరక్షణ పనులకు ప్రాధాన్యం

Feb 13 2026 3:42 AM | Updated on Feb 13 2026 3:42 AM

జలసంర

జలసంరక్షణ పనులకు ప్రాధాన్యం

కేటీదొడ్డి: నాబార్డు నిధులతో జలసంరక్షణ పనులు చేపట్టేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని నాబార్డు రాష్ట్ర రీజినల్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ సల్కన్‌ఖాన్‌, జిల్లా అభివృద్ధి అధికారి మనోహన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని సిద్దోనిపల్లి, మల్లాపురంతండా గ్రామాల్లో నాబార్డు నిధులతో చేపట్టిన గంతిరాల వాటర్‌షెడ్‌ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాబార్డు నిధులతో ఐదేళ్లపాటు అమలు చేయనున్న ఈ ప్రాజెక్టు ద్వారా భూసార పరిరక్షణ, వర్షపునీటి సంరక్షణ, భూగర్భజలాల పెంపు తదితర పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టుతో రైతుల ఆదాయ వృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో సంస్ధ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, సీఈఓ విశ్వనాథాచారి, సర్పంచ్‌ పాండునాయక్‌, మాజీ సర్పంచ్‌ ఆంజనేయులు, తిమ్మప్ప పాల్గొన్నారు.

వేరుశనగ క్వింటా రూ.9,020

గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు బుధవారం 397 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 9,020, కనిష్టంగా రూ. 5,089, సరాసరి రూ. 6,490 ధరలు లభించాయి. అదే విధంగా 50 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,369, కనిష్టంగా రూ. 3,129, సరాసరి రూ. 7349 ధరలు పలికాయి. క్వింటా ఆముదాలు రాగా.. రూ. 5,919 ధర లభించింది.

నల్లమలలో

ఆక్వా కల్చర్‌ సెంటర్‌

అచ్చంపేట: నల్లమలలో వంద ఎకరాల విస్తీర్ణంలో రూ.50 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోనే మూడో ఆక్వా కల్చర్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తా మని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నా రు. గురువారం అచ్చంపేట మండలం చంద్రసాగర్‌ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం అభివృద్ధి కార్యక్రమం, ముదిరాజ్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రూ.4 కోట్ల తో అధునాతన టెక్నాలజీతో చంద్రసాగర్‌లో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి చేసే చేపపిల్లలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభు త్వం మత్స్యశాఖకు రూ.3 వేల కోట్లతో బడ్జెట్‌ రూపొందిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో పదేళ్లుగా చేపపిల్లల ఉత్పత్తి నిలిచిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ ఏడాది రూ.123 కోట్లతో 88 కోట్ల చేపపిల్లలు కొనుగోలు చేసి 26 వేల చెరువుల్లో వదిలినట్లు వెల్లడించారు. అంచెలంచెలుగా రాష్ట్రంలో చేపపిల్లల కొనుగోలు తగ్గించి ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ముదిరాజ్‌లకు చెరువులపై పూర్తి హక్కులు కల్పించేందుకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని చెప్పారు. రాష్ట్రంలో పండుగ సాయన్న విగ్రహాల ఏర్పాటు, ముదిరాజ్‌ భవనాలను ప్రాధాన్యత క్రమంలో నిర్మిస్తామన్నారు. అచ్చంపేట ముదిరాజ్‌ భవనం నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అచ్చంపేట పాలశీతలీకరణ కేంద్రం సామర్థ్యాన్ని 30 లీటర్లకు పెంచుతామన్నారు. ముదిరాజ్‌లను బీసీ–ఏలో చేర్చేందుకు పోరాటం చేస్తామన్నారు. తనను అణగదొక్కే ప్రయత్నాలు ఎన్ని జరిగినా జంకలేదని.. మక్తల్‌లో చోటుచేసుకున్న బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య ఘటనలో తమ ప్రమేయం లేకపోయినా రాజకీయ రంగుపులిమేలా చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొడతామన్నారు. అంతకు ముందు రూ.18.21 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు.

జలసంరక్షణ  పనులకు ప్రాధాన్యం 
1
1/1

జలసంరక్షణ పనులకు ప్రాధాన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement