నామినేషన్ల స్వీకరణకు 13 కౌంటర్లు
గద్వాలటౌన్: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. గద్వాల మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా, ఇన్‌వార్డు సెక్షన్, మీసేవ సెంటర్‌లో నామినేషన్ల స్వీకరణ కౌంటర్లు ఏర్పాటుచేశారు. మొత్తం 37 వార్డులకు గాను మూడింటికి ఒక కేంద్రం చొప్పున 13 కౌంటర్లను ఏర్పాటుచేశారు. మున్సిపల్ కమిషనర్ జానకీరామ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
బాల్యవివాహాలను నిర్మూలిద్దాం
గద్వాల క్రైం: బాల్యవివాహాలను నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా బాలల పరిరక్షణ అధికారి నర్సింహ, ఐసీడీఎస్ సీడీపీఓ ఆకాశ దీప్తి అన్నారు. మంగళవారం గద్వాల మండలం పూడూర్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. ఎక్కడైనా బాల్యవివాహం చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1098 లేదా స్థానిక అధికారులకు సమాచారం అందించాలన్నారు. తద్వారా బాల్యవివాహాలను కట్టడి చేయవచ్చన్నారు. తల్లిదండ్రులు పిల్లల ఉజ్వల భవిష్యత్‌కు కృషి చేయాలని కోరారు.
వేరుశనగ ధరలు ౖపైపెకి..
గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో వేరుశనగ ధరలు ౖపైపెకి ఎగబాకుతున్నాయి. మూడు రోజుల క్రితం రికార్డు స్థాయిలో క్వింటాకు రూ. 9,389 ధర పలకగా.. మంగళవారం అంతకు మించి రూ. 11,190 నుంచి రూ.10,899 ధరలు వచ్చాయి. మూడు రోజుల క్రితం కర్ణాటక ప్రాంతం దేవునిపల్లికి రైతు సయ్యద్ ఎక్బాల్ అహ్మద్ 27 క్వింటాళ్ల వేరుశనగను విక్రయానికి తీసుకొచ్చి రూ. 9,389 ధర పొందారు. ఽమంగళవారం 479 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. ఇందులో వనపర్తి జిల్లా చిన్నదగడకు చెందిన రైతు కుర్మయ్య 27 క్వింటాళ్లు, కేటీదొడ్డి మండలం చింతలకుంటకు చెందిన మహిళా రైతు నర్సమ్మ 50 క్వింటాళ్ల వేరుశనగను ఖరీదుదారుడు నర్సింహులు రికార్డు స్థాయిలో కోడ్ చేసి కొనుగోలు చేశారు. రైతు కుర్మయ్య క్వింటాకు రూ. 11,190, మహిళా రైతునర్సమ్మ రూ. 10,899 ధర పొందారు. ఈ సీజన్‌లో ఇవి అత్యధిక ధరలుగా యార్డు అధికారులు పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో అత్యధిక ధరలు పొందిన ఇద్దరు రైతులతో పాటు ఖరీదుదారుడిని మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, వైస్‌చైర్మన్ శ్రీకాంత్, చింతలకుంట సర్పంచ్ రాజశేఖర్, యార్డు కార్యదర్శి నర్సింహ తదితరులు ఘనంగా సన్మానించారు.
బ్యాంకు ఉద్యోగుల
నిరసన
గద్వాలన్యూటౌన్: వారంలో ఐదు రోజులు మాత్రమే పనిదినాలు ఉండాలని డిమాండ్ చేస్తూ.. మంగళవారం అన్ని బ్యాంకుల ఉద్యోగులు విధులను బహిష్కరించారు. అనంతరం యూనైటెడ్ బ్యాంక్ యూనియన్స్ ఫోరం ఆధ్వర్యంలో స్థానిక ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. రెండున్నరేళ్ల క్రితం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) వారంలో ఐదు రోజులు మాత్రమే పనిదినాలు ఉండేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చిందన్నారు. కానీ ఇంతవరకు ఆ హామీ నెరవేరలేదన్నారు. వారంలో ఐదు రోజులు మాత్రమే పనిదినాలు కల్పిస్తే.. ఖాతాదారులు, బ్యాంకు సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాము రోజు 40 నిమిషాలు అధిక సమయం పనిచేస్తామని చెప్పామన్నారు. ఇప్పటికై నా వారంలో ఐదు రోజుల పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాజమౌళి, శేఖర్, కృష్ణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రవికుమార్, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
నామినేషన్ల స్వీకరణకు 13 కౌంటర్లు


