పదేళ్లలో గద్వాల అస్తవ్యస్తం
● ఇక్కడి ఎమ్మెల్యే ఏ పార్టీలో
ఉన్నారో కూడా చెప్పలేని దుస్థితి
● ఎంపీ డీకే అరుణ
గద్వాల: పదేళ్లుగా అభివృద్ధిచేసే నాయకులు లేకపోవడంతో గద్వాల పట్టణంతో మొదలుకొని నియోజకవర్గం మొత్తం అస్తవ్యస్తంగా మారిందని మహ బూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవా రం జిల్లా కేంద్రంలోని డీకే బంగ్లాలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఇళ్లు లేని నిరుపేదలకు ఇచ్చి న ఇంటి స్థలాలను బలవంతంగా లాక్కొని రోడ్డునపడేశారని ధ్వజమెత్తారు. గద్వాల ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పలేని దుస్థితిలో ఉన్నా రని ఎద్దేవా చేశారు. అభివృద్ధి కోసం సీఎంను కలిసినట్లు చెబుతున్న ఎమ్మెల్యే.. ఇప్పటి వరకు ఆయన చేసిన అభివృద్ధి ఏమిటో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. చేనేత పార్కు నిర్మాణం ఇప్పటి వరకు అతీ గతి లేకుండా పోయిందన్నారు. పట్టణంలోని 37 వార్డుల్లో కొత్తగా జరిగిన అభివృద్ధి ఎంతమాత్రం లేదన్నారు. పేదల ఇంటి స్థలాల్లో ఆస్పత్రి, కాలేజీల నిర్మాణం చేపడుతూ.. తీరని అన్యాయం చేశారన్నా రు. గద్వాల ప్రాంతాన్ని తాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాననే విషయం ప్రజలందరికీ తెలుసన్నా రు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలి పించి, మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఉన్నారు.


