ఐద్వా మహాసభలు జయప్రదం చేయండి
అలంపూర్: హైదరాబాద్‌లో ఈ నెల 25న నిర్వహించే ఐద్వా మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు ఏమెలమ్మ, జిల్లా కార్యదర్శి నర్మద పిలుపునిచ్చారు. అలంపూర్ పట్టణంలోని సంతోష్‌నగర్ కాలనీలో బుధవారం ఐద్వా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఐద్వా 14వ జాతీయ మహాసభల జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఐద్వా పోరాట ఫలితంగా అనేక హక్కులు సాధించుకున్నామన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, గ్రామాల్లో బెల్ట్ షాపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు దేవమ్మ, కాంతమ్మ, మదనమ్మ, లక్ష్మి, పార్వతమ్మ, ఏసమ్మ, బుజ్జమ్మ, మరియమ్మ, కవిత తదితరులు ఉన్నారు.
నీటి వినియోగంపై
లెక్క పక్కా..
గద్వాల క్రైం: జిల్లాలోని జలాశయాలు, భూగర్భ జలాలు, ఎత్తిపోతల పథకాల గణనను బుధవారం జలాశయాల మంత్రిత్వశాఖ, ఆర్థిక గణాంక శాఖ హైదరాబాద్‌కు చెందిన నిపుణులు సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా జల నిపుణులు మహేందర్‌రెడ్డి, విశ్వేశ్వరయ్య మాట్లాడుతూ.. గద్వాల, అలంపూర్ సెగ్మెంట్లలో భూగర్భ, జలాశయాలు, ఎత్తిపోతల పథకాల అనుసంధానంగా ఉన్న వాటిని సర్వే చేయడంతో పాటు జియోట్యాగింగ్ చేస్తామన్నారు. ఈ విధానంతో నీటి పంపిణీ విధానం, నీటి పారుదల విస్తీర్ణం, జలాశయాల ద్వారా వ్యవసాయ పంటలకు చేరుతున్న నీటి వాటాలపై ప్రణాళికలు తెలియజేస్తుందన్నారు. జలాశయాల ద్వారా జిల్లాలో మత్స్య సంపద, సాగు పంటల వివరాలను సులువుగా తెలుసుకునేందుకు దోహదపడుతాయని పేర్కొన్నారు. అవసరమైయ్యే నీటి వినియోగంపై పక్కా లెక్కలతో పాటు అవగాహన వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పాపయ్య, నాగర్జునగౌడ్ తదితరులు ఉన్నారు.
రాజాగారి బంగ్లా
మరమ్మతుకు రూ.10 కోట్లు
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలో శిథిలావస్థకు చేరిన రాజాగారి బంగ్లా మరమ్మతుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వసతిగృహాల పునరుద్ధరణకు రూ.13.15 కోట్లు కేటాయించినట్లు వివరించారు. వచ్చిన నిధులతో రాజాగారి బంగ్లాను ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామన్నారు.
పురపాలికల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
అమరచింత: తమ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడమేగాకుండా పురపాలికల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పశుసంవర్దకశాఖమంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం పట్టణంలోని పది వార్డుల్లో రూ.15 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. తమ ప్రభుత్వం స్థానిక పురపాలికకు ఇప్పటి వరకు రూ.35 కోట్లు కేటాయించిందని.. మునుపెన్నడూ లేని విధంగా సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. వార్డుల్లో సీసీ రహదారులు, డ్రైనేజీలు, పార్క్‌లు, కూడళ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు వివరించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వార్డుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉండాలని.. అనంతరం ప్రతి ఒక్కరూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఆర్డీఓ సుబ్రమణ్యం, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, డీసీసీ ప్రధానకార్యదర్శి అయ్యూబ్‌ఖాన్, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు మహేందర్‌రెడ్డి, అరుణ్‌కుమార్, మార్కెట్ డైరెక్టర్లు పోసిరిగారి విష్ణు, శ్యామ్, కమలాకర్‌గౌడ్, తౌఫిక్ తదితరులు పాల్గొన్నారు.
ఐద్వా మహాసభలు జయప్రదం చేయండి
ఐద్వా మహాసభలు జయప్రదం చేయండి


