ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలి
గద్వాల(మల్దకల్): ప్రజలందరూ ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలని శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీకృష్ణ జ్యోతిస్వరూపానంద స్వామీజీ అన్నారు. మంగళవారం మల్దకల్ ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, అర్చకులు మధుసూదనాచారి, రవిచారి స్వామీజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో విశేష పూజల అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. అదే విధంగా వాసవీ కన్యకా పరమేశ్వరిదేవిని స్వామీజీ దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు వేద ప్రవచనాలు వినిపించారు. మారుతున్న కాలానుగుణంగా ప్రజలు సన్మార్గంలో పయనించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చెడు వ్యసనాలు వీడి.. భగవంతుడిని ఆరాధించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రావు, నరేందర్, పద్మారెడ్డి, నాగరాజు, శ్రీనివాస్, వెంకటేశ్, రాజు, శ్రీనివాస్‌శెట్టి పాల్గొన్నారు


