విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేయాలి

Feb 9 2026 7:32 AM | Updated on Feb 9 2026 7:32 AM

విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేయాలి

విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేయాలి

గద్వాల: విద్యార్థులు సమాజానికి ఉపయోగపడేలా నూతన ఆవిష్కరణలు చేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఎస్సీ సంక్షేమాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆనంద నిలయంలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్‌ను పరిశీలించారు. సైన్స్‌ ఎంతో అభివృద్ధి చెందుతుందని, అందుకనుగుణంగా విద్యార్థి దశ నుంచే నూతన విషయాలను కనిపెట్టేలా అవసరమైన జ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. హాస్టల్‌ విద్యార్థులు ఇలా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రతివిద్యార్థి ప్రదర్శనను గురించి విద్యార్థులతో తెలుసుకుని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పలువురు విద్యార్థులు కలెక్టర్‌ యోగాసనాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో అదన పు కలెక్టర్‌ నర్సింగ్‌రావు, ఎస్సీ సంక్షేమాభివృద్ధి శాఖ జిల్లా అధికారి నుషిత, హాస్టల్‌ వార్డెన్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement