ప్రభుత్వ బడులు బలోపేతం
అలంపూర్: స్వచ్చంద సంస్థల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయలక్ష్మి అన్నారు. అలంపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం అలై ఎన్జీఓ ప్రతినిధులు, పాప్ సింగర్ స్మిత, సుశీలతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. అలై ఎన్జీఓ ఆధ్వర్యంలో తొమ్మిది పాఠశాలల్లో రూ. 30లక్షల వ్యయంతో మధ్యాహ్న భోజన వంట గదుల ఆధునికీకరించినట్లు తెలిపారు. వంట గదిలో టైల్స్, ఫ్యాన్లు, కిచెన్ కట్టలు, ఫ్లోర్ రిపేర్, ప్రతి పాఠశాలకు ఒక సిలిండర్, గ్యాస్ స్టవ్, కుర్చీలు, విద్యార్థులకు ప్లేట్లు అందజేసినట్లు వివరించారు. కార్యక్రమంలో సేక్టోరియల్ అధికారి అంపయ్య, ఎంఈఓ అశోక్ కుమార్, కాంప్లెక్స్ హెచ్‌ఎం శ్రీనివాస్, జీహెచ్‌ఎం అమరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


