వైద్య పరికరాలపై ఆరా | - | Sakshi
Sakshi News home page

వైద్య పరికరాలపై ఆరా

Jan 22 2026 7:04 AM | Updated on Jan 22 2026 7:04 AM

వైద్య పరికరాలపై ఆరా

వైద్య పరికరాలపై ఆరా

వైద్య పరికరాలపై ఆరా

శాఖపరమైన చర్యలు తప్పవు

గద్వాల క్రైం: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రయివేట్‌ ఆస్పత్రుల నిర్వహణ, వైద్య సేవలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ బృందం విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. గద్వాల, అలంపూర్‌ సెగ్మెంట్‌లో రోగులకు అందుతున్న వైద్య సేవలు, అవసరమైయ్యే మందులు, వైద్యుల వివరాలు, స్కానింగ్‌ పరికరాల వినియోగం, మౌలిక వసతులపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో వైద్యశాఖ అనుమతి లేకుండా శాంతినగర్‌లో నిర్వహిస్తున్న ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిని ఈ నెల 2న సీజ్‌ చేయడంతో పాటు ఈసీజీ, ఎక్స్‌రే మిషన్లు, బయో వ్యర్థాల నిర్వహణ, రికార్డులు సరిగా లేనందుకు మరో రెండు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లఘించిన యాజమాన్యంపై చర్యలు తీసుకుంటున్నారు. వైద్య సేవల కోసం వస్తున్న రోగులు, ఎంత మంది అత్యవసర సేవలు పొందారు. మెరుగైన వైద్యం, జిల్లా ఆస్పత్రులకు సిఫార్సు చేయాల్సిన రోగుల వివరాలను సిబ్బంది సేకరించారు. అన్ని ఆస్పత్రుల్లో కూడా సాధారణ ప్రసవాలు చేసేందుకు వైద్యులు కృషి చేయాలని, అత్యవసరం అయితే తప్ప శస్త్ర చికిత్స చేయకూడదని ఆదేశించారు.

జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేట్‌ ఆస్పత్రిలోని సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్‌లో అందుబాటులో ఉన్న మందుల వివరాలను ఫార్మాసిస్టు ద్వారా తెలుసుకున్నారు. ప్రయివేట్‌ మెడికల్‌ దుకాణాల్లో అందుబాటులో ఉన్న మందులపై డ్రగ్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాదకరమైన వ్యాధులు, శస్త్ర చికిత్సలకు అందజేసిన మందులు, రోగుల వివరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అందుబాటులో లేని మందుల గురించి ఆరా తీశారు. గర్భిణుల కడుపులో బిడ్డ ఎదుగుదల గుర్తించేందుకు వినియోగించే స్కానింగ్‌, ఎక్స్‌రే, ఈసీజీ తదితర యంత్రాల పనితీరు, అందుబాటులో ఉన్న వైద్యులు, టెక్నీషియన్లు గురించి తెలుసుకున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. పలు ప్రయివేట్‌ ఆస్పత్రుల ఆధీనంలో కొనసాగే మెడికల్‌ దుకాణాలలో ఫార్మసిస్టులు లేకుండానే రోగులకు మందులు విక్రయిస్తున్నారనే విషయం డ్రగ్‌ అధికారుల తనిఖీలో వెలుగు చూసింది. దీంతో నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.

జిల్లా వైద్యా అధికారిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సంధ్యా కిరణ్మయి విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ప్రభుత్వ, ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న సేవలపై నిరంతరం ఆరా తీస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది నిర్లక్ష్యంపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కొనసాగుతున్న 52 ప్రయవేట్‌ ఆస్పత్రులు, 20 క్లీనిక్‌లు, 137 ల్యాబ్‌లు, 22 డెంటల్‌ క్లీనిక్‌లు, 2 ఫిజియోథెరపీ క్లీనిక్‌లు, 5 కంటి ఆస్పత్రుల అనుమతులు, మౌలిక వసతులు తదితర అంశాలపై నివేదికను అందజేయాల్సిందిగా ఆస్పత్రి నిర్వాహకులకు సూచించారు.

రోగుల వివరాలు.. సేవలపై ఆరా

మందుల రికార్డులు పరిశీలన

రిజిస్ట్రేషన్‌ లేని ఆస్పత్రి సీజ్‌

నిర్లక్ష్యం వహించిన యాజమాన్యంపై చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement