సీజన్‌లో అత్యధిక ధర..
గద్వాల యార్డుకు శనివారం 193 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. ఇందులో కర్ణాటక ప్రాంతం దేవునిపల్లి గ్రామానికి రైతు సయ్యద్ ఎక్బాల్ అహ్మద్ 27 క్వింటాళ్ల వేరుశనగను తీసుకురాగా.. బాగా నాణ్యతగా ఉండటంతో క్వింటాల్‌కు అత్యధికంగా రూ.9,389 ధరకు కొనుగోలు చేశారు. ఈ సీజన్‌లోనే ఇది అత్యధిక ధరగా యార్డు అధికారులు పేర్కొన్నారు. సీజన్‌లో రికార్డు స్థాయిలో అత్యధిక ధర పొందిన రైతు సయ్యద్ ఎక్బాల్ అహ్మ ద్‌ను మార్కెట్ యార్డు చైర్మన్ హన్మంతు, వైస్‌చైర్మన్ శ్రీకాంత్, యార్డు కార్యదర్శి నర్సింహ తదితరులు ఘనంగా సన్మానించారు.


