నో బస్.. నో సర్వీస్
నిత్యం ఇబ్బందులే..
బస్సులు లేక అవస్థలు..
అన్ని రూట్లకు బస్సులు..
ఇబ్బంది పడుతున్న గ్రామాలు..
మహబూబ్‌నగర్ : 4 పల్లెలకు..
వనపర్తి : 23 పల్లెలు..
జిల్లాలో మొత్తం 360 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో నాలుగు డిపోలు ఉండగా.. 275 గ్రామాలకు సర్వీసులు నడుస్తుండగా.. మరో 85 పల్లెలకు బస్సు సౌకర్యం లేదు. సుదూర ప్రాంతాల్లోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ప్రధానంగా 50 గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలని ఈ విద్యాసంవత్సరంలో ఆర్టీసీకి 16 దరఖాస్తులు రాగా.. 12 గ్రామాలకు పునరుద్ధరించారు.
ఇబ్బంది పడుతున్న గ్రామాలు..
మర్రిపల్లి (ఉప్పునుంతల), జమిస్తాపూర్ (నాగర్‌కర్నూల్), చెన్నంపల్లి, పద్మనపల్లి, కొత్త చెరువు, ఎంసీతండా (లింగాల), మైలారం, లక్ష్మీపల్లి, బాణాల, అంబగిరి, నర్సాయిపల్లి (బల్మూరు), ఖానాపూర్, గుడ్ల నర్వ, నెల్లికొండ (బిజినేపల్లి).
జిల్లాలో మొత్తం 261 గ్రామాలు ఉన్నాయి. ఒక డిపో ఉండగా.. 252 పల్లెలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. తొమ్మిది గ్రామాలకు మాత్రం బస్సు సర్వీసులు నడుస్తలేవు. 2025– 26లో బస్సు సౌకర్యం కల్పించాలని ఏడు గ్రామాలకు చెందిన ప్రజలు అర్జీలు పెట్టుకోగా.. తుంకుంట (అయిజ), మల్లెందొడ్డి (మల్దకల్)కి మాత్రమే సర్వీస్‌లు నడిపిస్తున్నారు. ప్రధానంగా ఆరు గ్రామాలకు చెందిన విద్యార్థులు బస్సుల్లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఇబ్బంది పడుతున్న గ్రామాలు..
రాయపురం (గట్టు), తుమ్మిళ్ల (రాజోళి), కుర్వపల్లి, పరాముల (గద్వాల), మైలగడ్డ (ధరూర్), ఇటిక్యాలపాడు (మానవపాడు).
జిల్లాలో మొత్తం 276 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో రెండు డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 157 గ్రామాలకు మాత్రమే బస్సు సౌకర్యం ఉంది. 119 పల్లెలకు ఆర్టీసీ సర్వీసులు లేవు. 2025–26 విద్యా సంవత్సరంలో ఉజ్జని (మాగనూర్), సంగంబండ (మక్తల్), రాయికోడ్ (నర్వ) గ్రామాలకు ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామస్తులు విజ్ఞప్తి చేయగా.. ఇప్పటి వరకు పెండింగ్‌లోనే ఉంది.
ఏయే గ్రామాలు అంటే..
షేర్నపల్లి, మేకహనుమాన్‌తండా, వందరగుట్ట తండా, పిల్లిగుండ్లతండా, బోయిన్‌పల్లి తండా (నారాయణపేట), చిన్నపొర్ల, పెద్దపొర్ల, మల్లేపల్లి, నాగిరెడ్డిపల్లి (ఊట్కూరు), అల్లీపూర్, తిమ్మారెడ్డిపల్లి (కొత్తపల్లి), ఎలిగండ్ల, పసుపుల, మాధవరం (మరికల్).
ఈ ఆటోలో కూర్చుని ప్రయాణిస్తున్నది అలంపూర్ మండలం సింగవరం గ్రామానికి చెందిన విద్యార్థులు. అలంపూర్‌కు 7 కి.మీ. దూరంలోని గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకు నిత్యం ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. సమయానికి పాఠశాలకు చేరుకునేందుకు ఇలా వాహనం సామర్థ్యానికి మించి కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. బస్సు సౌకర్యం కల్పిస్తే ఇబ్బందులు తొలగుతాయని విద్యార్థులు చెబుతున్నారు.
గట్టు నుంచి రాయాపురం వెళ్లేందుకు నిత్యం ఇబ్బందులు పడుతున్నాం. సాయంత్రం పాఠశాల వదిలిన తర్వాత 4:30 గంటల నుంచి రోడ్డుపై నిలబడినా బస్సులు రావు. అటుగా వెళ్లే ప్రైవేటు వాహనాలను లిఫ్ట్ అడుగుతాం. ఒక్కోసారి ఇంటికి చేరుకునేందుకు చీకటి పడుతుంది. మాకు బస్సు సౌకర్యం కల్పించాలి.
– అమృత, 10వ తరగతి విద్యార్థి,
రాయాపురం గట్టు మండలం
నా కూతురు మౌనిక గట్టులో 10వ తరగతి చదువుకుంటుంది. క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్తుంది. సాయంత్రం పాఠశాల వదిలిన తర్వాత గట్టు నుంచి ఇంటికి వచ్చేందుకు బస్సు సౌకర్యం లేకపోవడంతో నా కూతురుతో పాటు మిగతా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకు బస్సు సౌకర్యం కల్పించాలి.
– తిమ్మప్ప, రాయాపురం, గట్టు మండలం
జిల్లావ్యాప్తంగా 252 గ్రామాలకు బస్సులు నడుపుతున్నాం. అదే విధంగా కొత్తగా ఇటిక్యాలపాడు, తూంకుంట, మల్లెందొడ్డిలో రూట్లకు బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నాం. ఇంకా అవసరమున్న గ్రామాల పరిధిలో బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటాం. – సునీత, ఆర్టీసీ డీఎం, గద్వాల
టంకర, కిష్టారం (హన్వాడ), కొత్తపల్లి (మిడ్జిల్), రామచంద్రపూర్ (మహబూబ్‌నగర్ రూరల్)
జిల్లాలో 423 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో ఒక ఆర్టీసీ డిపో ఉండగా.. దీని పరిధి 45 రూట్లలో బస్సులు నడుస్తున్నాయి. నాలుగు గ్రామాలకు బస్సు సర్వీసులు లేకపోవడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. టంకర మినహాయించి మూడు గ్రామాలకు చెందిన వారు బస్సులు నడపాలని విజ్ఞప్తులు చేసినా.. అమలు కాలేదు.
..ఇదీ భావి భారత పౌరుల దుస్థితి. ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక.. ఉన్నప్పటికీ సమయపాలన పాటించకపోవడం.. వచ్చినా ఆపకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పడుతున్న అగచాట్లకు ఈ దృశ్యాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కాలినడకన కొందరు.. ప్రమాదమని తెలిసినా ఆటోల్లో కిక్కిరిసి వేళ్లాడుతూ మరికొందరు.. బస్సుల్లో ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణం చేస్తూ ఇంకొందరు నరకయాతన అనుభవిస్తున్నారు. స్థానికంగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు లేకపోవడం.. రవాణా ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టడంలో పాలకుల వైఫల్యం వెరసీ విద్యార్థులు నానా ఫీట్లతో దినదినగండంగా రాకపోకలు చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరులోని పలు గ్రామాల్లో నిత్య సవాళ్ల మధ్య చదువుల యుద్ధం కొనసాగిస్తున్న విద్యార్థులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్..
– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
జిల్లాలో మొత్తం 212 గ్రామాలు ఉన్నాయి. ఒక ఆర్టీసీ డిపో ఉండగా.. దీని పరిధిలో 189 గ్రామాలకు మాత్రమే సర్వీస్‌లు నడిపిస్తున్నారు. 23 పల్లెలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు రవాణా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలని 11 గ్రామాల నుంచి అర్జీలు రాగా.. ఆరు పల్లెలకు మాత్రమే నడుపుతున్నారు.
విద్యార్థులు ఇబ్బంది పడుతున్న
గ్రామాలు..
దావాసిపల్లి (పాన్‌గల్), నగరాల (శ్రీరంగాపురం), కంభాళపూర్‌తండా (ఖిల్లాఘనపురం), చె న్నూర్ (గోపాల్‌పేట), మిరాస్‌పల్లి (కొత్తకోట).
నో బస్.. నో సర్వీస్
నో బస్.. నో సర్వీస్


