తెలుగోనిపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

తెలుగోనిపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు

Feb 6 2026 8:50 AM | Updated on Feb 6 2026 8:50 AM

తెలుగ

తెలుగోనిపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు

ధరూరు: మండలంలోని అల్వాలపాడు తెలుగోనిపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ఉదయం స్వామివారి అలంకరణ, కుంకుమార్చన, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఉపనయనం, పల్లకీసేవ చేశారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి ఆలయం వద్ద ఉన్న కోనేరులో స్వామివారి తెప్పోత్సవం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు అర్చకులు కిష్టాచారి తెలిపారు. ముఖ్యంగా కర్ణాటక భక్తులు పాల్గొని ప్రత్యేకంగా నైవేద్యాలు తయారు చేసి స్వామివారికి సమర్పించారు. రాత్రి అఖండ భజన కార్యక్రమం నిర్వహించారు. ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రం స్వామివారి ఉచ్ఛాయ మహోత్సవం (రథోత్సవం) కార్యక్రమం జరగనుంది.

నేడు స్వామి వారి రథోత్సవం

తెలుగోనిపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు 1
1/1

తెలుగోనిపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement