ప్రత్యర్థుల కోటలపైనే గురి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యర్థుల కోటలపైనే గురి

Feb 8 2026 7:21 AM | Updated on Feb 8 2026 7:21 AM

ప్రత్యర్థుల కోటలపైనే గురి

ప్రత్యర్థుల కోటలపైనే గురి

అన్ని పార్టీల అభ్యర్థులది ఇదే ఎజెండా

ప్రత్యర్థి ఓటు బ్యాంకుకు తూట్లు పొడిచేలా వ్యూహాలు

గత ఎన్నికల్లో భంగపడిన నాయకుల ముందు జాగ్రత్త

బలమైన ప్రాంతాల్లో పాగా

మరికొంతమంది నాయకులు గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకున్నామంటూ ప్రత్యర్థికి బలమైన ప్రాంతాల్లో పాగా వేస్తున్నారు. కొంతమంది ఈ ఒక్కసారికి చూడండి అంటూ సానుభూతితో ముందుకొస్తుండటంతో ప్రత్యర్థులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. గద్వాల పట్టణంలో వైరిపక్షాల మధ్య తీవ్ర పోటీ సాగుతున్న 15 నుంచి 18 వార్డుల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో భంగపడిన నాయకులు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విజయం చేజారిపోరాదానే కృతనిశ్చయంతో ఆయా పార్టీల శ్రేణులు పనిచేస్తున్నాయి.

గద్వాల: గత ఎన్నికల్లో ప్రత్యర్థి భారీగా ఓట్లు పొందిన ప్రాంతాలను గుర్తించడం.. ఈసారి అక్కడ లోటు పడకుండా చూసుకోవడం.. పట్టణంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఏకై క ఎజెండా ఇది. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా అందుకు అవసరమైన వ్యూహాన్ని రూపొందించుకోవడంలో నాయకులు నిమగ్నమయ్యారు. ప్రత్యర్థి ఓటు బ్యాంకుకు తూట్లు పొడవటం ద్వారా తాను విజయం సాధించడంపైనే అందరు అభ్యర్థులు దృష్టిసారిస్తున్నారు. దీంతో పోటీ తీవ్రంగా ఉన్న వార్డుల్లో నాయకుల ఎత్తులతో వాతావరణం వేడెక్కుతోంది. పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ఉధృతం చేశారు. తమ ఓటు బ్యాంకులను కాపాడుకుంటూనే ఎదుటి పక్షం ఓట్ల కోటను ముక్కలు చేసే లక్ష్యంతోనే అందరూ ముందుకు సాగుతున్నారు. దీంతో ప్రతిఒక్కరూ ప్రచార పర్వంలో ముందడుగు వేస్తూ అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తమ కోటగా భావించే ప్రాంతానికి ప్రత్యర్థి వచ్చి వెళ్లాడంటే ఎంత ధీమా ఉన్నా.. మరోసారి అక్కడికి వెళ్లి పరిస్థితిని అంచనా వేసుకోవాల్సి వస్తుంది.

ఓట్లలో చీలిక తెచ్చేలా..

ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికలు రాజకీయ భవితవ్యానికి సవాల్‌గా మారడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కీలకంగా మారిన కొన్ని వర్గాల ఓట్లపై దృష్టి కేంద్రీకరించారు. భారీ సంఖ్యలో ఉన్న ఒకవర్గం ఓట్లలో చీలిక తెచ్చేలా ప్రధాన పార్టీలు పోటీపడుతున్నాయి. పట్టణంలోని ప్రధాన పక్షాల మధ్య పోటీ తీవ్రంగా ఉన్న వార్డుల్లో ఇరుపక్షాలు ఎదుటి పక్షం ఓటు బ్యాంకుకు కన్నం వేసే పనిలోనే నిమగ్నమయ్యారు. అభ్యర్థులు వార్డులకు వెళ్లేటప్పుడు తన వెంట ఉండే కార్యకర్తల విషయలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో మైనస్‌ అయిన కాలనీలను గుర్తించి అక్కడ కూడా ఈసారి ఆధిక్యం వచ్చేలా ప్రధాన పార్టీలు ప్రణాళిక రూపొందిస్తున్నాయి. గత రెండేళ్ల కాలంలో ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరించడం ద్వారా వారిని తమవైపు తిప్పుకొనేందుకు పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు.

● కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రధానంగా మైనార్టీ ఓట్లపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. మైనార్టీ ఓట్లను వీలైనంత అధికంగా పొందడమే ప్రధాన లక్ష్యంగా వ్యూహం రచిస్తున్నారు.

● బీఆర్‌ఎస్‌ తమ ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే ప్రత్యర్థి వర్గం ఓట్లకు గండికొట్టే వ్యూహాలు పన్నుతోంది. మైనార్టీ ఓట్లను పెద్దమొత్తంలో పొందాలని చూస్తుంది.

● ఇక కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న వ్యూహాలను నిర్వీర్యం చేసి ఒకవర్గం ఓట్లన్నీ మొత్తంగా పొందాలని బీజేపీ పావులు కదుపుతోంది.

● మిగతా పార్టీలు, స్వతంత్రులు సైతం తమ ప్రచార సరళిని కూడా మార్చుకొని వార్డుల్లో ఓటర్లకు దగ్గరవడం ద్వారా ప్రధాన పార్టీల ఓటు బ్యాంకును కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ప్రతి వార్డులోనూ ప్రధాన పార్టీల అభ్యర్థులు బలబలాలు బేరీజు వేసుకుని లోటును పూడ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement