నాడు కూల్చివేత.. నేడు పునర్నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

నాడు కూల్చివేత.. నేడు పునర్నిర్మాణం

Feb 4 2026 7:10 AM | Updated on Feb 4 2026 7:10 AM

నాడు

నాడు కూల్చివేత.. నేడు పునర్నిర్మాణం

అక్రమ నిర్మాణాలకు

కలిసొస్తున్న ఎన్నికలు

గద్వాలటౌన్‌: జిల్లాకేంద్రమైన గద్వాల మున్సిపాలిటీలో ప్రజా అవసరాల కోసం వదిలిన 10 శాతం స్థ లాల్లో అక్రమ నిర్మాణాలు రోజురోజుకు పెరిగిపోతు న్నాయి. స్థానిక 6వ వార్డులోని బసవన్న చౌరస్తాలో రూ. 50లక్షల విలువచేసే మున్సిపల్‌ స్థలంలో ఓ వ్యక్తి పదేళ్ల క్రితం అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టగా.. అధికారులు గుర్తించి పూర్తిగా నేలమట్టం చే శారు. ఆ తర్వాత చాలాకాలం పాటు నిర్మాణం జోలి కి వెళ్లకుండా గమ్మునుండిపోయారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగం ఎన్నికల విధుల్లో ఉండటాన్ని గమనించి.. ఇదే అదునుగా మళ్లీ అక్రమ నిర్మాణాన్ని చేపట్టారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు గతేడాది ఫిబ్రవరి 18న ఆ నిర్మాణాన్ని మరోసారి కూల్చివేశారు. తాజాగా ము న్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఎవరికి కనిపించకుండా పరదాలు కట్టి అక్రమంగా నిర్మాణాన్ని చేపడుతుండటం గమనార్హం. ఈ అక్రమ నిర్మాణంపై స్థానికులు మరోసారి మున్సిపల్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.కబ్జాదారుడు కొంతమంది నాయకులకు ముడుపులు చెల్లించాడనే ఆరోపణ లు ఉన్నాయి. అక్రమ నిర్మాణంపై అధికారులు మ రో సారి ఎలా వ్యవహరిస్తారో అనే అంశంపై సర్వ త్రా ఆసక్తి నెలకొంది. అక్రమ నిర్మాణాన్ని ఎన్నికల కూల్చివేతగా స్థానికులు చర్చించుకుంటున్నారు.

నాడు కూల్చివేత.. నేడు పునర్నిర్మాణం 1
1/1

నాడు కూల్చివేత.. నేడు పునర్నిర్మాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement