బరిలో 1,573 మంది | - | Sakshi
Sakshi News home page

బరిలో 1,573 మంది

Feb 4 2026 7:10 AM | Updated on Feb 4 2026 7:10 AM

బరిలో 1,573 మంది

బరిలో 1,573 మంది

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/సాక్షి, నాగర్‌కర్నూల్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో తుదిపోరులో నిలిచిన అభ్యర్థులు ఎవరన్నది తేలిపోయింది. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 19 మున్సిపాలిటీల్లో 376 వార్డులకు మొత్తం 1,573 మంది బరిలో ఉన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 3,177 నామినేషన్లు రాగా.. వీటిలో 10 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మరో 675 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అత్యధికంగా మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌లో మొత్తం 347 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, గద్వాల మున్సిపాలిటీలో 160 మంది, వనపర్తిలో 150 మంది, నాగర్‌కర్నూల్‌లో 102 మంది ఎన్నికల బరిలో నిలిచారు. అత్యల్పంగా అలంపూర్‌లో 36 మంది, వడ్డేపల్లి, దేవరకద్ర మున్సిపాలిటీల్లో 40 మంది చొప్పున పోటీలో ఉన్నారు.

ఉమ్మడి జిల్లాలో 19 పురపాలికల్లో మొత్తం 376 వార్డులు/డివిజన్లు

అత్యధికంగా మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌లో 347 మంది బరిలో..

తక్కువగా అలంపూర్‌లో 36 మంది, దేవరకద్ర, వడ్డేపల్లిలో 40 మంది చొప్పున అభ్యర్థుల పోటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement