వీడని పీఠముడి | - | Sakshi
Sakshi News home page

వీడని పీఠముడి

Feb 15 2026 7:34 AM | Updated on Feb 15 2026 7:34 AM

వీడని పీఠముడి

వీడని పీఠముడి

గద్వాల మున్సిపల్‌ చైర్మన్‌ స్థానంపై హైడ్రామా

కూటమి : బంపర్‌ ఆఫర్‌

బీఆర్‌ఎస్‌, బీజేపీలు సైతం కూటమిగా ఏర్పడి కాంగ్రెస్‌ పార్టీకి చైర్మన్‌ పీఠం దక్కకుండా పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన రాష్ట్ర ముఖ్యనేత, బీజేపీకి చెందిన రాష్ట్ర ముఖ్యనేతతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. రెండు పార్టీలు కలుపుకొని 18 స్థానాలు కాగా.. మ్యాజిక్‌ ఫిగర్‌కు ఇంకో సీటు అసవరం. ఇక్కడే బీఆర్‌ఎస్‌– బీజేపీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తమకు మద్దతు ఇచ్చే స్వతంత్ర అభ్యర్థికి ఏకంగా చైర్మన్‌ పీఠాన్ని ఇస్తామని బంపర్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన స్వతంత్ర అభ్యర్థి కూటమి వైపు జంప్‌ చేస్తే అప్పుడు కూటమిదే పైచేయి అవుతుంది. దీంతో ఎక్స్‌అఫీషియో ఓటు కీలకం కానుంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి విప్‌నకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే ఇరు పార్టీలకు 19 స్థానాలు వస్తాయి. అప్పుడు టాస్‌ కీలకం కానుంది. ఆ తర్వాత ట్విస్టులు.. హైడ్రామాలు దాటుకొని చైర్మన్‌ పీఠాన్ని ఎవ రు దక్కించుకుంటారో తెలియాలంటే సోమ వారం జరిగే చైర్మన్‌ ఎన్నిక వరకు ఆగాల్సిందే.

గద్వాల: విలక్షణ రాజకీయాలకు వేదికై న నడిగడ్డలో మరోసారి ‘పీఠ’ముడి నెలకొంది. మున్సిపల్‌ ఎన్నికల్లో గద్వాల పురపాలికలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో జిల్లాకేంద్రమైన గద్వాల మున్సిపాలిటీ పీఠాన్ని కై వసం చేసుకునేందుకు ఒకవైపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ.. మరోవైపు బీఆర్‌ఎస్‌, బీజేపీలు కూటమిగా ఏర్పడి ఎవరికి వారుగా పావులు కదుపుతున్నారు. మొత్తం 37 స్థానాలకు గాను కాంగ్రెస్‌ పార్టీ 16, బీఆర్‌ఎస్‌ 11, బీజేపీ 7, స్వతంత్రులు 2, ఎంఐఎం ఒక స్థానాలు గెలుపొందాయి. జనరల్‌కు రిజర్వు అయిన చైర్మన్‌ స్థానానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 19 స్థానాలు ఏ పార్టీకి రాలేదు. దీంతో చైర్మన్‌ పీఠం దక్కించుకునేందుకు ఎవరికి వారు ఎత్తుగడలు వేస్తూ గద్వాలలో కాకరేపుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి 16 సీట్లు రాగా ఇప్పటికే వారు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులను తమవైపు తిప్పుకోవడంతోపాటు ఎంఐఎం అభ్యర్థి మద్దతు సైతం కూడగట్టినట్లు సమాచారం. మరోవైపు బీఆర్‌ఎస్‌, బీజేపీలు కూటమిగా ఏర్పడటంతో 18 స్థానాలకు చేరుకున్నాయి. మ్యాజిక్‌ ఫిగర్‌కు అవసరమైన ఒక్కస్థానాన్ని దక్కించుకునేందుకు అన్ని రకాల ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో కొనసాగుతున్న క్యాంపు రాజకీయం

ఎమ్మెల్యే బండ్ల ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ

కూటమిగా ఏర్పడిన బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు

తీవ్ర ఉత్కంఠ రేపుతున్న జిల్లాకేంద్రం చైర్మన్‌గిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement