నేడే.. పురస్కారం | - | Sakshi
Sakshi News home page

నేడే.. పురస్కారం

Feb 16 2026 7:50 AM | Updated on Feb 16 2026 7:50 AM

నేడే.

నేడే.. పురస్కారం

మున్సిపాలిటీల్లో కొలువుదీరనున్న నూతన పాలకవర్గాలు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి పాలమూరు ఎన్నికలు జరిగిన ఒక కార్పొరేషన్‌, 18 మున్సిపాలిటీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఆయా పురపాలికల్లో సోమవారం నిర్వహించే కొత్త పాలక మండళ్ల సమావేశానికి ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 11 గంటలకు ఎన్నికై న కార్పొరేటర్లు/కౌన్సిలర్లతో ప్రత్యేకాధికారి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం 12.30 గంటలకు పరోక్ష పద్ధతిలో మహబూబ్‌నగర్‌ బల్దియాలో మేయర్‌, డిప్యూటీ మేయర్‌.. మున్సిపాలిటీల్లో చైర్మన్‌/చైర్‌పర్సన్‌, డిప్యూటీ చైర్మన్‌/డిప్యూటీ చైర్‌పర్సన్లను ఎన్నుకోనున్నారు.

కాంగ్రెస్‌కు 14 ఖాయం..

భూత్పూర్‌, కొత్తకోట, వనపర్తి, పెబ్బేరు, ఆత్మకూరు, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, కల్వకుర్తి, మక్తల్‌, కోస్గి, మద్దూర్‌తో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. వడ్డేపల్లిలో ఏఐఎఫ్‌బీ మ్యాజిక్‌ ఫిగర్‌ను సాధించగా.. గెలుపొందిన ఎనిమిది మంది చేయి అందుకున్నారు. మ్యాజిక్‌ ఫిగర్‌కు ఒకటి, రెండు అడుగుల దూరంలో ఉన్న దేవరకద్ర మున్సిపాలిటీ, మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌లో పీఠం హస్తానికి దక్కడం ఖాయమైంది. ఇప్పటివరకు మొత్తంగా 14 పురపాలికల్లో ఆ పార్టీ పాగా వేయనుంది.

అయిజలో బీఆర్‌ఎస్‌..

అలంపూర్‌లోనూ..

అలంపూర్‌ నియోజకవర్గంలోని అయిజ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌కు స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. ఇక్కడ 20 వార్డులు ఉండగా.. బీఆర్‌ఎస్‌ 13, కాంగ్రెస్‌ ఏడు స్థానాల్లో గెలుపొందాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటడంతో ఈ పురపాలిక పీఠాన్ని ఆ పార్టీ కై వసం చేసుకోనుంది. మరోవైపు అలంపూర్‌లో 10 వార్డులు ఉండగా.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు చెరి సమానం వచ్చాయి. ఎక్స్‌అఫీషియోగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ సైతం కారు విజయం ఖాయమైంది.

వనపర్తి జిల్లా అమరచింతలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ కూటమినే పీఠం వరించనున్నట్లు తెలుస్తోంది. 10 వార్డులు ఉండగా.. మూడు చొప్పున కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ గెలుపొందాయి. ఒక సీపీఎం అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతిస్తుండడంతో ఆ పార్టీ బలం నాలుగుకు చేరింది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిస్తే ఆరు కాగా.. మంతనాలు సాగుతున్నాయి. చైర్మన్‌ పదవిని పంచుకునేందుకు ఇరు పార్టీలు అంగీకారం తెలిపినా.. తొలి పర్యాయంపై ఎవరికి వారు పట్టుబడుతున్నట్లు సమాచారం.

గద్వాలలోనూ ‘చేతి’కే అవకాశం .. అయినా..

అమరచింతలో కారు, కమలం కూటమికే..

నారాయణపేటలో బీజేపీకే మొగ్గు..

ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్‌, 18 మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు

వడ్డేపల్లితో కలిపి కాంగ్రెస్‌కు మొత్తంగా 12 చోట్ల స్పష్టమైన ఆధిక్యం

మహబూబ్‌నగర్‌, దేవరకద్ర కూడా వారి ఖాతాలోనే..

గద్వాలలో సైతం హస్తానికే అవకాశం

నారాయణపేటలో బీజేపీకే మొగ్గుచూపుతున్న పరిస్థితులు

అయిజతో పాటు అలంపూర్‌లో బీఆర్‌ఎస్‌కు లైన్‌క్లియర్‌

అమరచింతలో బీఆర్‌ఎస్‌, బీజేపీ కూటమికే..

నేడే.. పురస్కారం1
1/2

నేడే.. పురస్కారం

నేడే.. పురస్కారం2
2/2

నేడే.. పురస్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement