దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల స్కీం రెన్యూవల్, నూతన పాఠశాలల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి నుషిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని అర్హతలు కలిగి.. మౌలిక వసతుల గల పాఠశాలలు బెస్ట్ అవైబుల్ స్కూల్ కింద నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. కొత్తగా నమోదు చేసుకునే పాఠశాలలు సంబంధిత ధ్రువపత్రాలను ఈ నెల 25 నుంచి వచ్చే నెల 30వ తేదీలోగా జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఇప్పటికే ఈ స్కీంలో కొనసాగుతున్న పాఠశాలలు రెన్యూవల్ కోసం అవసరమైన ధ్రువపత్రాలను 31వ తేదీలోగా సమర్పించాలని కోరారు.
దరఖాస్తుల ఆహ్వానం


