చెల్లని ఓట్లతో చిక్కులు..
మున్సిపాలిటీ చెల్లని నోటా పోస్టల్
ఓట్లు ఓట్లు బ్యాలెట్లు
మహబూబ్‌నగర్(కా) 986 683 1,012
దేవరకద్ర 104 19 12
భూత్పూర్ 113 22 35
వనపర్తి 734 278 300
కొత్తకోట 97 28 56
పెబ్బేరు 113 22 39
అమరచింత 76 12 39
ఆత్మకూరు – 02 41
గద్వాల 434 143 282
అయిజ 173 113 65
అలంపూర్ 48 31 33
వడ్డేపల్లి 104 24 22
నారాయణపేట 200 71 101
మక్తల్ – – 39
కోస్గి – – 67
మద్దూరు 51 17 15
నాగర్‌కర్నూల్ 243 81 73
కల్వకుర్తి 166 43 28
కొల్లాపూర్ 92 39 43
సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌తో పాటు మిగతా మున్సిపాలిటీల్లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పలుచోట్ల పెద్దసంఖ్యలో ఓట్లు తిరస్కరణకు గురికావడం ఆశ్చర్యం కలిగించింది. అతి తక్కువ మెజార్టీతో పరాభావం పొందిన అభ్యర్థులు తమ ఓటమిలో చెల్లని ఓట్లు కూడా కారణంగా ఉన్నాయని అంచనా వేసుకుంటున్నారు. అలాగే చాలాచోట్ల అభ్యర్థుల కన్నా నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. వాస్తవికంగానే అభ్యర్థులు ఎవరూ నచ్చక నోటాకు ఓటేశారా, లేక గుర్తులపై అయోమయంతో నోటాపై ఓటు ముద్ర వేశారా? అన్న దానిపై అభ్యర్థులు చర్చించుకున్నారు.
పలు మున్సిపాలిటీల్లో అధికంగా చెల్లని ఓట్లు..
ఉమ్మడి జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో చెల్లని ఓట్ల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పలు వార్డుల్లో పెద్ద సంఖ్యలో ఓట్లు తిరస్కరణకు గురికావడంతో అభ్యర్థులు తలలు పట్టుకున్నారు. తక్కువ మెజార్టీతో గెలిచిన చోట పలుమార్లు రీకౌంటింగ్ నిర్వహించడం, తిరస్కరించిన ఓట్లు, నోటాపై పడిన ఓట్లపై కౌంటింగ్ సిబ్బందితో వివాదాలు, వాదనలు చోటుచేసుకున్నాయి. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో 60 డివిజన్‌లకు గానూ అత్యధికంగా 1,086 ఓట్ల తిరస్కరణకు గురయ్యాయి. ఇక్కడ అత్యధికంగా 683 మంది నోటాపై ఓటేశారు. వనపర్తిలోనూ 734 ఓట్లు తిరస్కరణకు గురికావడంతో పాటు మరో 278 ఓట్ల నోటాకు దక్కాయి. గద్వాలలో 434 ఓట్లు చెల్లకుండాపోగా, 143 మంది నోటాకు ఓటేశారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలోనూ 243 ఓట్లు తిరస్కరణకు గురికాగా, మరో 81 ఓట్లను నోటాకు సంబంధించిన స్వస్తిక్ గుర్తుపై వేశారు.
పోలైనవి...1012, చెల్లనివి 216
మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌కు మొదటిసారిగా జరిగిన ఎన్నికలు చరిత్రాత్మకంగా నిలువనున్నాయి. ఈ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్‌లలో 58వ డివిజన్ ఏకగ్రీవం కావడంతో మిగిలిన 59 డివిజన్‌లలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1012 ఓట్లు పోలవ్వగా.. అందులో 216 ఓట్లు చెల్లనివి నమోదు కావడం గమనార్హం. ఉద్యోగులు తమ ఓటుహక్కును వినియోగించుకోవడంలో ఎంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించరనేది దీన్ని బట్టి తెలుస్తోంది. అత్యధికంగా 10, 25వ డివిజన్‌లలో 16 చొప్పున చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఓటింగ్‌పై పూర్తిస్థాయి అవగాహన ఉన్న ఉద్యోగులే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటారు. పైగా వీరంతా ఎన్నికల విధుల్లో పాల్గొంటూ ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా నిర్వహిస్తారు. అలాంటి పోలింగ్ సిబ్బంది ఓటు వేసే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ పెద్ద సంఖ్యలో చెల్లని ఓట్లు ఉండటం చర్చనీయాంశమైంది.
ఉమ్మడి జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో అధిక సంఖ్యలో ఓట్ల తిరస్కరణ
మహబూబ్‌నగర్, వనపర్తి,
గద్వాలలో చెల్లని ఓట్లతోపాటు నోటాకు అధికంగా ఓట్లు
వీటి ప్రభావంతో అభ్యర్థుల
భవితవ్యం తలకిందులు
అయినట్టుగా అంచనాలు
పొరపాట్లు, తప్పిదాలతోనే అధికంగా చెల్లని ఓట్లు
మహబూబ్‌నగర్‌లో పోస్టల్ బ్యాలెట్‌లోనూ చెల్లని ఓట్లు
చెల్లని ఓట్లతో చిక్కులు..
చెల్లని ఓట్లతో చిక్కులు..


