హరోంహర.. అడివేశ్వరా...
● వైభవంగా స్వామివారి రథోత్సవం
● మార్మోగిన శివనామస్మరణ
రథోత్సవంలో పాల్గొన్న భక్తులు
రాజోళి: మండల కేంద్రంలో భ్రమరాంబ అడివేశ్వరస్వామి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం స్వామి, అమ్మవార్ల రథోత్సవం కనులపండువగా నిర్వహించారు. ముందుగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. అనంతరం రథోత్సవం నిర్వహించగా.. ఎమ్మెల్యే విజయుడు హాజరై రథానికి ప్రత్యేక పూజలు చేసి ముందుకు లాగారు. వేలాది మంది భక్తుల జయ జయ ధ్వానాలు, శివనామస్మరణతో రాజోళి మార్మోగింది.
హరోంహర.. అడివేశ్వరా...


