జూరాల.. తగ్గుముఖం | - | Sakshi
Sakshi News home page

జూరాల.. తగ్గుముఖం

Feb 19 2026 9:39 AM | Updated on Feb 19 2026 9:39 AM

జూరాల

జూరాల.. తగ్గుముఖం

నీటి సరఫరా అస్తవ్యస్తం.. రెండు మండలాలకు ఇబ్బంది..

సాగునీటికి 600 క్యూసెక్కులు..

ఎల్లూరు రిజర్వాయర్‌తో ఊరట..

–8లో u

తాగునీటి కష్టాలు తీర్చాలి..

గ్రామంలో మిషన్‌ భగీరథ నీటి సరఫరా పూర్తిస్థాయిలో కావడం లేదు. సమీపంలో జూరాల ప్రాజెక్టు ఉందని సంబుర పడాల్సిందే తప్ప వేసవి వచ్చిందంటే తాగునీటి కోసం చేతి పంపులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి తాగునీటి కష్టాలు తలెత్తకుండా చూడాలి.

– వెంకటేష్‌, నందిమళ్ల

గ్రామంలో మిషన్‌ భగీరథ నీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉంది. అమరచింత క్రాస్‌రోడ్‌ నుంచి పైప్‌లైన్‌కు మోటారు ద్వారా నీటిని సరఫరా చేస్తే తప్ప గ్రామానికి తాగునీరు వచ్చే పరిస్థితి లేదు. అధికారులు స్పందించి గతంలో ఉన్న సత్యసాయి తాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తే తాగునీటి కష్టాలు తీరుతాయి. – రాజు, మస్తీపురం

జిల్లాలోని అన్ని మండలాలకు ఎల్లూరు రిజర్వాయర్‌ నుంచి తాగునీటిని సరఫరా చేస్తున్నాం. జూరాల ప్రాజెక్టు ద్వారా అమరచింత, ఆత్మకూర్‌ మండలాలకు మాత్రమే తాగునీరు అందుతుంది. ఈ రెండు మండలాలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ప్రణాళికను సిద్ధం చేసుకొని పూర్తిస్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకుంటాం.

– విజయ్‌కుమార్‌, డీఈఈ, మిషన్‌ భగీరథ

జూరాల జలాశయంలో

ప్రస్తుత నీటినిల్వ

అమరచింత: ఉమ్మడి జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల జలాశయంలో నిల్వ నీటిమట్టం రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 3.262 టీఎంసీలు మాత్రమే ఉండటంతో వేసవిలో తాగునీటి పథకాలకు సరిపడా నీటిని అందించలేని పరిస్థితి ఎదురుగాక తప్పదని అనిపిస్తోంది. ప్రాజెక్టు నిల్వనీటి సామర్థ్యం 11 టీఎంసీలు కాగా.. 9 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసి ఏటా వానాకాలంతో పాటు యాసంగిలో సైతం ఆయకట్టుకు సాగునీటిని వదులుతారు. ఈ ఏడాది కూడా వానాకాలంలో పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందించిన ప్రభుత్వం.. యాసంగిలో మాత్రం ఎడమ, కుడి కాల్వ పరిధిలో కేవలం 25 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని వారబందీ విధానంలో అందిస్తూ మిగిలిన వాటిని తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు.

● జూరాల ఎడమ కాల్వ పరిధిలో 85 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. యాసంగిలో రామన్‌పాడ్‌ రిజర్వాయర్‌ వరకు కేవలం 20 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. దిగువ ఆయకట్టు రైతులు తమకు సాగునీరు ఇవ్వాలని కోరినా.. వేసవిలో తాగునీటి అవసరాల దృష్ట్యా సరఫరా చేయాలేమంటూ చెప్పుకొచ్చారు.

జిల్లాలో తాగునీటి పథకాలు..

జూరాల ప్రాజెక్టుపై ఆధారపడి సత్యసాయి తాగునీటి పథకంతో పాటు రామన్‌పాడు, బుగ్గపల్లి, గోపాల్‌పేట తాగునీటి పథకాలతో జిల్లావ్యాప్తంగా 250కి పైగా గ్రామాలకు మిషన్‌ భగీరథ తాగునీరు అందుతోంది. ఏటా వేసవిలో తాగునీటి అవసరాలకు సరిపడా నీరు ప్రాజెక్టులో లేకపోవడంతో ఎగువనున్న నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి రెండు టీఎంసీలు సరఫరా చేయించుకొని గట్టెక్కుతున్నారు.

రోజురోజుకు పడిపోతున్న నిల్వ నీటిమట్టం

యాసంగిలో వారబందీ విధానంలో ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ఆయకట్టుకు రోజుకు 600 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 3.262 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. దీనికితోడు ప్రాజెక్టు గేట్ల లీకేజీలు, ఆవిరి రూపంలో రోజు 60 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది. అలాగే జలాశయంలో రెండు టీఎంసీల మేర పూడిక పేరుకుపోయింది.

ప్రస్తుతం 3.262 టీఎంసీలు మాత్రమే..

వారబందీ విధానంలో ఆయకట్టుకు

సరఫరా

వేసవికి ముందే తలెత్తనున్న తాగునీటి కష్టాలు!

ఎల్లూరు రిజర్వాయర్‌ నుంచి జిల్లాలోని అన్ని మండలాలకు తాగునీరు అందుతున్నందున వేసవిలో కేవలం ఆత్మకూర్‌, అమరచింత మండలాలకు మాత్రమే తాగునీటి కష్టాలు ఎదురయ్యే పరిస్థితులు దాపురించాయి. ఆయా మండలాలు జూరాలపై ఆధారపడటంతో తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు.

జూరాల.. తగ్గుముఖం 1
1/1

జూరాల.. తగ్గుముఖం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement