బీచుపల్లి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
ఎర్రవల్లి: అమావాస్య సందర్భంగా మంగళవారం బీచుపల్లి క్షేత్రంలోని అభయాంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించి.. స్వామివారి దర్శనానికి క్యూ కట్టారు. ముందుగా కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయ ప్రదాన అర్చకులు ఆంజనేయస్వామికి పుష్పాలంకరణ, ఆకుపూజ, అభిషేకం, మహా మంగళహారతి వంటి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పాలకమండలి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రామన్‌గౌడ్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.


