మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు
కేటీదొడ్డి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. మంగళవారం మండలంలోని కొండాపురం పాఠశాలలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. డీఈఓ వెంట జిల్లా సమన్వయ అధికారి హంపయ్య ఉన్నారు.
నాబార్డు సేవలు వినియోగించుకోవాలి
ఎర్రవల్లి: నాబార్డు అందిస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఆ సంస్థ జిల్లా అభివృద్ధి అధికారి మనోహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బట్లదిన్నెలో నిర్వహించిన ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమానికి ఆయన హాజరై.. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు ఖాతాల నిర్వహణ, పొదుపు పథకాలు, ప్రభుత్వ రుణాలు పొందే విధానాన్ని వివరించారు. అదే విధంగా నాబార్డు అందిస్తున్న పంట రుణాలు, రైతు రుణమాఫీ, పంటబీమా, బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎల్‌డీఎం శ్రీనివాసరావు, సీఎఫ్‌ఎల్ జిల్లా కోఆర్డినేటర్ శేఖర్‌రెడ్డి, టీజీబీ మేనేజర్ రాజశేఖర్‌రెడ్డి, ిఫీల్డ్ ఆఫీసర్ సాయికుమార్, కార్యదర్శి వెంకటేశ్వర్లు, సీఎఫ్‌ఎల్ కౌన్సిలర్లు మధుకృష్ణ, రవిసాగర్ పాల్గొన్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి
గద్వాల: రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని టీజీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ సంతోష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లను యథావిధిగా కొనసాగించాలన్నారు. అదే విధంగా పే స్కేలు అమలుపర్చాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు అజిత్‌కుమార్, నాగార్జున్‌గౌడు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు
మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు


