ఆదిశిలావాసుడికి ప్రత్యేక పూజలు
మల్దకల్: ఆదిశిలాక్షేత్రంలో స్వయంభూగా వెలసిన లక్ష్మీవేంకటేశ్వరస్వామికి శనివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారి స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా సద్దలోనిపల్లి కృష్ణస్వామి, పాల్వాయి అడవి ఆంజనేయస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్పస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన వసతి కల్పించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, చంద్రశేఖర్‌రావు, సిబ్బంది రంగనాథ్, ఉరుకుందు, కృష్ణ, శివమ్మ, రాము, శ్రీను, చక్రి, వాల్మీకి పూజారులు తదితరులు పాల్గొన్నారు.
61 మందికి టీబీ పరీక్షలు
ఎర్రవల్లి: ఇటిక్యాల మండలంలోని ఉదండాపురం గ్రామంలో శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి సాధిక్ హాజరై వైద్య సిబ్బందితో కలిసి గ్రామంలో వివిధ లక్షణాలు ఉన్న 61 మందికి టీబీ పరీక్షలు నిర్వహించారు. గ్రామంలో 60 ఏళ్లు పైబడినవారు, అండర్ వెయిట్ వారు, పొగ, మద్యం తాగేవారు, ఓల్డ్ టీబీ వ్యాధిగ్రస్తులు, హైరిస్క్ ఏరియాలో ఉన్నవారు, రక్తపోటు, డయాబెటిక్ ఉన్నవారిని గుర్తించి వారికి ఎక్స్‌రే పరీక్షలు, టీబీ స్ఫూటం, బీపీ, ఇతర రక్ష పరీక్షలు నిర్వహించారు. అనంతరం టీబీ వ్యాధి నిర్ధారించిన ఐదుగురికి ఉచితంగా మందులు అందజేసి.. వైద్యపరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మహేష్, టీబీ నోడల్ పర్సన్ ప్రభాకర్, ఎస్‌టీఎస్ విజయ్, హెచ్‌ఎస్ చంద్రనాగమ్మ, హెచ్‌ఏ రమేష్, ఏఎస్‌ఎం మహేశ్వరి, వెంకటేష్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
ఆదిశిలావాసుడికి ప్రత్యేక పూజలు


