బ్రెస్ట్‌ కేన్సర్‌పై అవగాహన.. గిన్నిస్‌ బుక్‌లో చోటు.. | SBI Life's Thanks A Dot Initiative Sets Guinness World Record | Sakshi
Sakshi News home page

బ్రెస్ట్‌ కేన్సర్‌పై అవగాహన.. గిన్నిస్‌ బుక్‌లో చోటు..

Oct 30 2025 10:42 AM | Updated on Oct 30 2025 11:06 AM

SBI Life's Thanks A Dot Initiative Sets Guinness World Record

మహిళల్లో రొమ్ము కేన్సర్‌పై ప్రముఖ ప్రైవేటు రంగ బీమా సంస్థ ఎస్‌బీఐ లైఫ్‌ చేపట్టిన అవగాహన ప్రచారం గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. ఈ విషయాన్ని సంస్థ నగర ప్రతినిధులు తెలిపారు. 

బ్రెస్ట్‌ హెల్త్‌ను ప్రతి ఇంటా చర్చించుకోవాల్సిన విషయం అనే అవగాహన పెంపొందించడం లక్ష్యంగా 1,191 ‘హగ్‌ ఆఫ్‌ లైఫ్‌’ హాట్‌ వాటర్‌ బ్యాగ్‌లను ఉపయోగించి, ‘టేక్‌ ఎ బ్రెస్ట్‌ సెల్ఫ్‌–ఎగ్జామ్‌ విత్‌ థాంక్స్‌–ఎ–డాట్‌’ అనే సందేశాన్ని ప్రదర్శించే అతి పెద్ద మొజాయిక్‌ను రూపొందించడం ద్వారా ఈ ఘనత సాధించామన్నారు. 

2023లోనే మహిళలు స్వయంగా సెల్ఫ్‌–బ్రెస్ట్‌ పరీక్షను సురక్షితంగా నిర్వహించుకునేందుకు తోడ్పడేలా ప్రపంచంలోనే తొలిసారిగా తమ సంస్థ ‘హగ్‌ ఆఫ్‌ లైఫ్‌’ హాట్‌ వాటర్‌ బ్యాగ్‌ను ప్రవేశపెట్టిందని వివరించారు.  

(చదవండి: ఈ తరం వైబ్స్‌.. దేశీ టూన్స్‌..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement