మనం సరదాగా తినే కొన్ని రకాల స్నాక్స్ అనారోగ్యం బారినపడేందుకు కారణమవుతుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి అందరూ ఇష్టంగా లాగించే సమోసా. నోరూరించే ఈ సమోసా కోసం ఆఫీసులకి వెళ్లేవాళ్ల దగ్గర నుంచి రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునే చిన్న చితక వ్యాపారుల వరకు టీ టైంలో స్నాక్ ఐటెంగా తినే వంటకమే ఈ సమోసా. రూ.10 లేదా 20 వెచ్చించి కొనుక్కుని తినే దాంతో ఆస్పత్రిపాలై రూ. 3లక్షల అప్పు కొని తెచ్చుకుంటున్నామని హెచ్చరిస్తున్న గుండె వైద్యుడి పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఢిల్లీ కార్డియాలజిస్ట్ "అనారోగ్యకరమైన ఆఫీస్ స్నాక్స్ సమోసాతో సవంత్సరాలుగా ఎంత ఖర్చు పెడుతున్నాం. ఆ తర్వాత దాని కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్య కొని తెచ్చుకుని ఎంత అప్పులపాలవ్వుతున్నాం. " కళ్లకు కట్టినట్లుగా వివరించారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు తెచ్చే చేటు అంత ఇంత కాదంటూ మండిపడుతున్నారు వైద్యులు.
ప్రతి సాయంత్రం చాలామంది తీసుకుని సమోసా ధర మహా అయితే రూ. 20 ఉంటుందనుకుంటే..క్రమం తప్పకుండా తినేవాడికి 15 ఏళ్లకు 300 సార్లు తింటాడనుకుంటే..మొత్తం ఖర్చు రూ. 90,000 అవుతుంది. అంటే అనారోగ్యకరమైన ఆహారం కోసం అంతమొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నామే కానీ ఆదా చేయడం లేదు. ఇలా తినడం వల్ల గుండెల్లో కరోనరీ ధమనుల్లో సమస్య ఏర్పడి.. యాంజియోప్లాస్టీ చేయించుకునే పరిస్థితికి కొని తెచ్చుకుంటాం.
అదేనండి స్టంట్ వేయించుకున్నాం అంటుంటారు కదా హార్ట్ పేషెంట్లు. అంటే సమోసాలు తిన్న ఫలితం హార్ట్ సర్జరీకి దారితీస్తుంది. దాని ఖర్చు రూ. 3 లక్షలు. అంటే అనారోగ్య ఆహారానికి ఖర్చు చేసే డబ్బుని ఆదా చేసినా ఆరోగ్యంగా ఉంటాం గానీ..తిని మరి యాంజియోప్లాస్టీ చికిత్స రూపంలో రూ. 3లక్షల అప్పుని కొని తెచ్చుకుంటున్నాం అంటూ ఆలోచింప చేసేలా..చాలా చక్కగా లెక్కలు వేసి వివిరించారు ఢిల్లీ కార్డియాలజిస్ట్.
అంతేగాదు దాని ఫలితం ఎన్నో రోజులు భూమ్మీద ఉండే అవకాశం లేదనేలా పలు రకాల అనారోగ్య సమస్యల రూపంలో వార్నింగ్ ఇస్తుందట. సాధ్యమైనంత వరకు ఎంత తొందరగా ఇలాంటి ఆహారపు అలవాట్లను దూరం చేసుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. అలాగే ఆరోగ్యంగా ఉండేలి అంటూ ప్రణాళికల దగ్గర ఆగిపోతే.. జీవితం మన కోసం ఆగిపోదు అనేది గ్రహించండి అని నొక్కి చెబుతున్నారు గుండె వైద్యులు.
Office canteen samosa: ₹20
Angioplasty: ₹3 lakhs
Samosas per year: 300
Years of eating: 15
Total samosa cost: ₹90,000
You're not saving money on unhealthy food.
You're taking a loan against your arteries at 400% interest.— Dr Shailesh Singh (@drShaileshSingh) October 23, 2025
వ్యాయామం చేయాల్సిన ప్రాధాన్యత..
అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉంటూ..వ్యాయామం వంటి అలవాట్లను కష్టంగా అనిపించినా..అవి దైనందిన లైఫ్‌లో రోటీన్‌గా ఎలా మారుతాయో వివరించారు వైద్యులు. ఒక వారం వ్యాయమాల వల్ల శారీర కష్టాలు అనుభవించి ఉండొచ్చు. కానీ కంటిన్యూగా చేస్తూ ఉంటే..నెలాఖరికిగా అదొక అలవాటుగా మారిపోవడమే గాక, చేయకపోవడమే తప్పుగా లేదా లోటుగా అనేలా మారుతుందని అన్నారు.
(చదవండి: నీటికి బదులు బీర్! స్పెషల్ హైడ్రేషన్ స్టయిల్..)


