గత కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం సరిగ్గా లేదంటూ పుకార్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆయనకు వయసైందని ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే ట్రంప్ వీటన్నిటిని కొట్టిపడేసి ఐయామ్ ఆల్‌రైట్ అన్నారు. అయితే తన వృద్ధాప్యం నేపథ్యంలో ట్రంప్ మనసులోని మాటపై న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్ ఒక ఆసక్తికర కథనం ప్రచురించింది
న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్ నివేదిక ప్రచురించిన కథనంలో డొనాల్డ్ ట్రంప్ భవిష్యత్తులో ప్రజలు తనను ఏఅంశంలో గుర్తుంచుకుంటారో అనే విషయంపై అధికంగా ఆలోచిస్తున్నారని ప్రచురించింది.అయితే ట్రంప్ తన జుట్టుకు గోల్డ్ కలర్ వేయడానికి ఇష్టపడట్లేదని దానిని నేచురల్‌గా ఉండడానికి ఇష్టపడుతున్నారని పేర్కొంది. ఆయన మనస్సులో ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారని తెలిపింది
అయితే ట్రంప్ వ్యక్తిత్వంపై ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్ మాట్లాడుతూ "ట్రంప్ మూఢనమ్మకం గల వ్యక్తి, ఆయనమరణం గురించి ఆలోచించడానికి ఇష్టపడడు. అతను భవిష్యత్తు కంటే వర్తమానంలో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతారు. ఎదో విధంగా ఆయన అందరి మనస్సులో ఉన్నారు. ఆయనకు ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి". అన్నారు.
అయితే ఇటీవల వైట్ హౌస్ ఆయనను అత్యంత శక్తివంతమైన అధ్యక్షుఽడిగా అభివర్ణించింది. ఆయనకు సగటు మనిషికంటే ఎక్కుువ ఓర్పు,శక్తి ఉన్నాయి. ఆయన జ్ఞాపకశక్తి అద్భుతంగా ఉంది. ఆయన ప్రస్తుతం మరింతగా కష్టపడి పనిచేయగలరు. అని డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇటీవల ట్రంప్ ఆయన వైద్యులు సూచించిన దాని కంటే అధిక మోతాదులో ఆస్పిరిన్ తీసుకుంటానన్నారు. తనకు 81 మి.గ్రా సూచించగా తాను మాత్రం రోజుకు 325 మి.గ్రా. ఆస్పిరిన్ తీసుకుంటానని వెల్లడించాడు, క్యాబినెట్ సమావేశాల్లో నిద్రపోతున్నట్లు వచ్చిన ఆరోపణల్ని ఖండించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ అంతర్గత మథనంపై టైమ్స్ మ్యాగజైన్ ఆసక్తికర నివేదిక ప్రచురించింది.


