హైదరాబాద్ మహా నగరం.. టెక్ సిటీ, ఫుడ్ హబ్, కల్చర్ సెంటర్ మాత్రమే కాదు ఈ జనరేషన్ మెంటల్ హెల్త్‌ను అత్యంత సీరియస్‌గా తీసుకుంటున్న నగరం కూడా. వేగంగా మారుతున్న లైఫ్‌స్టైల్, టార్గెట్స్, హడావిడిగా నడిచే టైమ్‌లైన్.. ఇవన్నీ ప్రస్తుత రోజుల్లో ఒత్తిడిని అందరికీ దగ్గర చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆందోళన, నిరాశ, కోపం వంటి భావోద్వేగాలు నేటి ఆధునికుల్లో సర్వసాధారణం అవుతున్నాయి. ఇది మానసిక, శారీరక ఒత్తిడిని సూచించే మానసిక భాషల్లో ఒక భాగం. అయితే ఇది మోతాదుకు మించి ఉంటే ప్రతికూల ప్రభావాలను కలిగించే ప్రమాదం ఉంది. అయితే ప్రస్తుతం హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో తరచూ వినిపించే ‘డెడ్‌లైన్’, ‘రోలౌట్’, ‘క్లయింట్ ప్రెషర్’ వంటి మాటలు ఈ తరానికి అలవాటైపోతున్నాయి. దీంతో అనేక మానసిక, శారీరక రుగ్మతలకు లోనవుతున్నారు. ఆయా సమస్యల నుంచి బయటపడేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు.
ప్రస్తుత తరంలో ఉరుకుల పరుగుల జీవితం మామూలే. మరీ ముఖ్యంగా నిమిషాలను, సెకన్లను లెక్కబెట్టుకుంటూ.. డెడ్‌లైన్ పేరుతో ఒత్తిడికి గురవుతున్నారు. ఈ తరం ఒత్తిడిని అర్థం చేసుకోడానికి, వారికి బాసటగా నిలవడానికి, సరైన క్రమంలో గైడ్ చేయడానికి వ్యక్తులు లేదా వ్వవస్థలు వంటి సాంకేతిక వేదికల కోసం వెతుకుతున్నారు. ఇలాంటి తరుణంలో మెంటల్ హెల్త్ కోసం సపోర్ట్ సిస్టమ్‌లు వినూత్న సాంకేతిక వేదికలు అందుబాటులోకి వస్తున్నాయి.
ఇందులో భాగంగా హైదరాబాద్‌లో గివ్ మీ ఫైవ్ (జీఎం–5) అనే టెక్నికల్ ప్లాట్‌ఫాం అందరినీ ఆకర్షిస్తోంది. ఇటీవల ఇంటర్నేషనల్ స్ట్రెస్ అవేర్‌నెస్ వీక్ నేపథ్యంలో సంస్థ ఆధ్వర్యంలో ఐదువేల మంది యువత, విద్యార్థులపై ఒత్తిడి ప్రభావంపై సర్వే నిర్వహించింది. ఈ ఒత్తిడి సమస్యల పరిష్కారానికి జీఎం–5 టెక్నాలజీ ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.
పలు నగరాల్లో అధ్యయనం..
హైదరాబాద్ వంటి నగరాల్లో యువతలో ఒత్తిడి విపరీతంగా పెరుగుతోందని పలు అధ్యయనాలు ఇప్పటికే వెల్లడించాయి. ఈ నేపథ్యంలో గివ్ మీ ఫైవ్ (జీఎం–5) బృందం తెలంగాణ, కర్ణాటకలోని ఐదువేల మంది యువత, విద్యార్థులపై ప్రత్యేక సర్వే చేపట్టింది.
ఈ సర్వేలో భాగంగా ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు ఏదో ఒక మెంటల్ హెల్త్ సమస్యతో బాధపడుతున్నారని తేలింది. ఇలాంటి వారిలో నిద్రలేమి, పరీక్షల ఒత్తిడి, తల్లిదండ్రుల ఎక్స్‌పెక్టేషన్స్ వంటి కారణాలతో చదువులపై ఇతర అంశాలపై దృష్టి సారించలేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రతి నగరంలోనూ యువతలో ఇలాంటి ఒత్తిడి సమస్యల సర్వసాధారణం అయిపోయింది.
థెరపీల కోసం విదేశాలకు..
ప్రస్తుత తరం, మరీ ముఖ్యంగా నగరవాసుల్లో ఒత్తిడికి లోనయ్యేవారు బ్రెజిల్ వంటి కొన్ని విదేశాల్లో థెరపీలకు వెళ్లడం సాధారణ విషయం. అంతేకాకుండా వ్యక్తిగత స్పేస్‌కు ప్రాధాన్యం ఎక్కువ. కానీ దేశంలో మానసిక ఆరోగ్యంలో కుటుంబం, సమాజం, అంచనాలు, బాధ్యతలు వంటి పలు అంశాలు భాగమేనని ఈ బృందం చెబుతోంది.
ఇది మనల్ని బలంగా నిలబెట్టినా, కొన్నిసార్లు ఒత్తిడిని తెచ్చిపెడుతుంది. ఈ మిక్స్‌డ్ ఎకోసిస్టమ్‌లో టెక్నాలజీ ఆధారిత ఫ్యామిలీ–ఇన్‌క్లూజివ్ సొల్యూషన్ చాలా అవసరమని వారు పేర్కొన్నారు. అదే సమయంలో ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రోగ్రెసివ్ దారి ఎంచుకుంటున్న నగరం హైదరాబాద్. కాస్తో కూస్తో వెల్‌నెస్ మీద శ్రద్ధ పెరుగుతుంది. సైకిల్ ట్రాక్స్, మారి్నంగ్ వాక్స్, హెల్దీ కెఫేలు, మెంటల్ హెల్త్ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌లు వంటివి ప్రస్తుతం యువతలో ట్రెండ్ అవుతున్నాయి. కానీ పూర్తిస్థాయిలో ఫలితాలను అందించట్లేదనేది వాస్తవ సత్యం.
భావోద్వేగాలను ట్రాక్ చేస్తుంది..
టెక్నాలజీ – వెల్‌నెస్ కలిసిన అద్భుత స్థలం భాగ్యనగరం. ఇందులో భాగంగానే గివ్ మీ ఫైవ్ యాప్ భారత బీటా లాంచ్ కోసం హైదరాబాద్‌ను ఎంచుకుంది. ఇక్కడి కుటుంబ బంధాలు, ఆతీ్మయత బాగుంటాయి. ఇదే మెంటల్ హెల్త్‌కు పెద్ద సపోర్ట్ సిస్టమ్. నర్వేలో భాగంగా రూపొందించిన ఈ యాప్ వచ్చే యేడాది జనవరి–ఫిబ్రవరిలో యూజర్లకు అందుబాటులోకి రానుంది. 10 నుంచి 50 ఏళ్ల వరకూం అందుబాటులో ఉంటుంది. రోజూ ఐదు సులభమైన ప్రశ్నలకు సమాధానాలిచ్చి వారి సోషల్ గ్రాఫ్‌ను అర్థం చేసుకోవచ్చు.
ప్రత్యేకమైన ఫీచర్‌గా కుటుంబ సభ్యులు లేదా ఫ్రెండ్ ‘కంపానియన్’లో జాయిన్ అవ్వచ్చు. ఇది ఇంట్లో, ఆఫీసులో, ఫ్రెండ్స్ మధ్య ఒక సెన్స్ ఆఫ్ కేర్, రెగ్యులర్ చెక్కిన్‌కు దోహదపడుతుంది. సమాధానాల ఆధారంగా భావోద్వేగాలను అర్థం చేసుకుని పరిష్కారాలను సూచిస్తుంది. ఏఐ ఆధారిత సూచనలు, ఫ్యామిలీ–ఫ్రెండ్స్‌తో కమ్యూనిటీ సపోర్ట్ ఇస్తుంది.
– డాక్టర్.లీసా ఫాహే, సైకాలజిస్ట్ ఆస్ట్రేలియా
పర్సనల్ స్పేస్ తప్పనిసరి..
ఒత్తిడిని జయించాలంటే ప్రతిఒక్కరికీ పర్సనల్ స్పేస్ తప్పనిసరి అని, ఇది మానసకి, శారీరక ఒత్తిడిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో యువత చాట్ జీపీటీ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో తమ భావాలను పంచుకుంటున్న తరుణంలో మెంటల్ హెల్త్‌కు ఒక సేఫ్ డిజిటల్ స్పేస్ ఉండటం ఎంతో అవసరమని నిపుణులు అంటున్నారు.
ఈ తరుణంలో ఓఏఎమ్ (ఓమ్) రూపొందించిన గివ్ మీ ఫైవ్ (జీఎం–5) యాప్ ఒత్తిడి నియంత్రణకు దోహదపడనుందని భావిస్తున్నారు. భావోద్వేగాలు వ్యక్తం చేయలేనివారు, గిల్టీ ఫీల్ ఉన్నవారు.. బిజీగా ఉండి వ్యక్తిగత, మానసిక స్థిరత్వంపై చొరవ చూపని వారికి ఈ యాప్ కొత్త సపోరి్టవ్ స్పేస్ అందించనుందని భావిస్తున్నారు.


