పక్షవాతం(స్ట్రోక్)కు గురైన రోగి శరవేగంగా కోలుకునేందుకు రోబోటిక్ ప్రక్రియ అద్భుతంగా తోడ్పడుతుందని హెల్త్ కేర్ ఎట్ హోమ్(హెచ్‌సీఏహెచ్) ఇండియా సహ వ్యవస్థాపకుడు ఢిల్లీకి చెందిన డాక్టర్ గౌరవ్ తుక్రాల్ అన్నారు. ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రోబోటిక్స్ అండ్ రికవరీని సోమాజిగూడలోని సువిటాస్ రిహాబిలిటేషన్ సెంటర్ బుధవారం ప్రారంభించింది.
కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ఇది స్ట్రోక్ న్యూరో రిహాబిలిటేషన్‌లో కీలకమైన ముందడుగని, రోబోటిక్స్, ఏఐ, సైన్స్, డేటా మిళితం చేయడం ద్వారా రోగులకు అత్యంత ఖచ్చితత్వంతో కూడిన రికవరీని అందించగలమన్నారు.
నడక సహా పలు అవయవాల కదలికలకు శిక్షణ అందించే ఈ సరికొత్త రోబోటిక్ గైటర్ పూర్తి మేడ్ ఇన్ ఇండియా కాగా రోగులు ఇప్పుడు ఎక్సోస్కెలిటన్–సహాయక నడక వ్యవస్థలను ఉపయోగించి కేవలం 30 నిమిషాల్లో వెయ్యి గైడెడ్ స్టెప్స్ తీసుకోవచ్చన్నారు. హెచ్‌సీఏహెచ్‌కు చెందిన అంకిత్ గోయెల్ తదితరులు పాల్గొన్నారు.
(చదవండి: బ్రెస్ట్ కేన్సర్‌పై అవగాహన.. గిన్నిస్ బుక్‌లో చోటు..)


