నగరవాసుల్లో ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు ఐరన్ లోపంతో బాధపడుతున్నారని అధ్యాయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కలంగా ఐరన్ అందించే ఉత్పత్తులు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని ప్రాక్టర్ అండ్ గాంబుల్ (పీ అండ్ జీ) హెల్త్ లిమిటెడ్ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ పాపన అన్నారు.
ఐరన్ లోపానికి పరిష్కారం అందించే లివోజెన్ ఐరన్ గమ్మీస్ నగర మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐరన్ తక్కువగా ఉండడం వల్ల అలసట, వెంట్రుకలు రాలడం వంటి సమస్యలు భారీగా పెరిగాయని, వీటి నివారణకు వీలుగా మహిళల రోజువారీ ఐరన్ అవసరాలు తీర్చే విధంగా ఈ గమ్మీస్ రూపొందించినట్లు వివరించారు.
(చదవండి: Smriti Mandhanas Father: ఆ లక్షణాలు గుండెపోటుకి సంకేతమా..? యాంజియోప్లాస్టీ ఎందుకు?)


