బరువు తగ్గడం అందరూ చాలా కష్టమనే భావిస్తారు. ఎందుకంటే అంత ఈజీగా కొలెస్ట్రాల్‌ని తగ్గించుకుని స్లిమ్‌గా మారడం సాధ్యం కాదు. కానీ ఈ అమ్మాయి అధిక బరువుతో మధుమేహం బారినపడ్డప్పటికీ అధైర్యపడకుండా బరువు తగ్గింది. డయాబెటిస్ నుంచి కూడా బయటపడింది. అలాగని కఠినమైన ఆహారనియమాలేం పాటించలేదు, చిన్ని చిన్న ఆహారపు అలవాట్లతోనే ఇదంతా సాధ్యం చేసిందామె. మరి అదెలాగో ఆమె మాటల్లో సవివరంగా తెలుసుకుందామా..!.
డైటీషియన్ జాకీ(Dietitian Jackie) తన వెయిట్ లాస్ జర్నీ గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇలా రాశారు. తనకు 20 ఏళ్ల వయసులో ఉండగా ప్రీ డయాబెటిక్(pre-diabetic) నిర్థారణ అయ్యిందని తెలిపింది. దాంతో ఇక ఇప్పుడైనా ఆరోగ్యంపై దృష్టిసారించక తప్పదని ఫిక్స్ అయ్యానని చెప్పింది. అదీగాక పేరెంట్స్ కూడా బరువు తగ్గేలా ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోమని సూచించడంతో..తన ఆరోగ్యాన్ని కాపాడుకునేలా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది.
30 కిలోలు ఎలా తగ్గిందంటే..
సరైన ఆహారం: తన డైట్‌లో మంచి పుడ్‌ని తీసుకునేలా పోషకాహార నిపుణుడి సలహాలను తీసుకున్నట్లు తెలిపారు. నారింజ రసం వంటి చక్కెర పానీయాలను, శుద్ధి చేసిన పిండితో చేసే ఆహారాలను దూరంగా ఉంచి, గోధుమ రొట్టెలను ఆహారంలో భాగం చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది. కేలరీలను తీసుకోవడాన్ని తగ్గించి, పోషకవంతమైన ఆహారాన్ని ఎక్కువగా తినేలా చూసుకునేదట.
ఫుడ్ తయారైన విధానం: వ్యాయామాలు చేసినంత మాత్రమే బరువు తగ్గరు. తీసుకునే అల్పాహారం, ఆరోగ్యకరమైనదా లేదా అని నిర్థారించుకునేదట. ముఖ్యంగా పోషకాహారం ఎంత మేర ఉందో తెలసుకుని మరి తీసుకునేదట. అలానే సమతుల్య ఆహారానికి ప్రాముఖ్యత ఇచ్చేదాన్ని అని చెప్పుకొచ్చింది.
వ్యాయామం..
చిన్న వామ్-అప్ వ్యాయామాలతో మొదలు పెట్టి..ట్రెడ్‌మిల్, ఆరు నుంచి ఏడు మైళ్లు పరుగుపెట్టడం వంటి వ్యాయామాలని పట్టుదలతో చేసి లక్ష్యానికి చేరుకున్నట్లు తెలిపారామె.
అలా బరువు తగ్గడమే కాదు, డయాబెటిస్‌ని క్యూర్ చేసుకున్నట్లు కూడా వివరించింది. అయితే తనకు వెయిట్‌లాస్ అవ్వడం కష్టమైన పని కాదని, అదొక నిర్వహణ దశ అని అంటోందామె. ఇప్పటికీ తాను ఆ అలవాట్లను కొనసాగిస్తున్నట్లు వివరించింది. తగ్గిన ఆ బరువుని నిర్వహిస్తే హెల్దీగా ఉంటామని..కేవలం జీవనశైలిలో మార్పులు చేసుకుంటే చాలని చెబుతోంది డైటీషియన్ జాకీ.
(చదవండి: Idli For Breakfast: ప్రయోజనాలేమిటి? సాంబార్,చట్నీతో తింటే లాభమా? నష్టమా?)


