చక్కెర బాధితులు తినదగ్గ దుంప... చిలగడదుంప! | Is It Safe to Eat Sweet Potatoes If You Have Diabetes | Sakshi
Sakshi News home page

Can Diabetics Eat Sweet Potato: చక్కెర బాధితులు తినదగ్గ దుంప... చిలగడదుంప!

Nov 9 2025 11:17 AM | Updated on Nov 9 2025 11:17 AM

Is It Safe to Eat Sweet Potatoes If You Have Diabetes

భూమిలో పండే దుంపలు షుగర్‌ బాధితులకు మంచివి కావనీ, ఎందుకంటే  అందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువ కాబట్టి డయాబెటిస్‌ బాధితుల్లో చక్కెర మోతాదులను పెంచేస్తాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే చాలామంది  షుగర్‌ బాధితులు ఆలుగడ్డలు (బంగాళదుంపలు) తినడానికి వెనకాడుతుంటారు. 

అయితే మిగతా దుంపల విషయం ఎలా ఉన్నా... చిలగడదుంపలతో మాత్రం ఆ ప్రమాదం లేదంటున్నారు ఆహార నిపుణులు. దీని నుంచి విడుదల అయ్యే చక్కెర మోతాదులు చాలా తక్కువ. అంటే ఇవి తిన్నప్పుడు వీటిలోంచి వెలువడే చక్కెర  తక్కువ గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ (లో–  గ్లైసిమిక్‌ ఇండెక్స్‌) ఉండటం వల్ల దీనితో అంతగా ప్రమాదం ఉండదనీ, పైగా ఇందులో విటమిన్‌–ఏ కూడా ఎక్కువగా ఉన్నందున  చక్కెర వ్యాధి ఉన్నవారు ఈ దుంపను తినవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే దాన్ని పరిమితంగా తీసుకోవడమే మంచిది. 

(చదవండి: ‘బ్యాటర్‌డ్‌ ఉమన్‌ సిండ్రోమ్‌’: ఇంటి హింస ఇంతింతై..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement