ఒకే తల్లికి పుట్టిన పిల్లలకు ఒకే విధమైన సమస్య రావడం చూస్తుంటాం. అలా కాకుండా..ఆఖరి పిల్లవాడిలో చూసిన రుగ్మత పెద్దపిల్లల్లో ఒకరి తర్వాత ఒకరూ బారినపడితే..అదొక మెడికల్ మిస్టరీలా ఉంటుంది. అలాంటి ఘటనే ఇక్కడ ఆవిష్కృతమైంది. వైద్యులు సైతం ఇదెలా సాధ్యం అని విస్తుపోతున్నారు.
అసలేం జరిగిందంటే..అమెరికాలోని వెస్ట్ వర్జినియాకు చెందిన ఒక కుటుంబంలో నలుగురు కుమార్తెలు ఒకరు తర్వాత ఒకరు ఒకే విధమైన మెదడు సంబంధిత రుగ్మత బారినపడ్డారు. తొలుత చిన్న కుమార్తెకు 18 నెలల వయసు ఉండగా ఈ సమస్యను గుర్తించారు.
అదీగా తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి ప్రతిదీ నేర్చుకోవడం ఆలస్యం కావడంతో..ఆ చిన్నారి విషయంలోనే ఆందోళ చెందేవారు. ఇప్పుడూ పెద్దవాళ్లైన ముగ్గురు పిల్లలు అదే రుగ్మత బారినపడ్డారని తెలిసి తల్లడిల్లిపోయారు.
ఏంటా వ్యాధి అంటే..
మెదడుకి సంబంధించిన చియారీ వైకల్యం. వైద్యానికి సవాలు విసిరేలా నలుగురు ఒకేసారి ఈ వ్యాధిని ఎదుర్కొవడం అంతుచిక్కని మిస్టరీలా అనిపించింది వైద్యులకు.
చియారీ వైకల్యం అంటే..
పుర్రె వెనుకభాగం మెదడు కణజాలం వెన్నెముకలోకి ప్రవేశించే పరిస్థితి. ఫలితంగా ఇది మెదడుపై ఒత్తిడిని కలిగిస్తుంది. దాంతో తలనొప్పి, మైకము, మెడ నొప్పి, బ్యాలెన్సింగ్‌కి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. సింపుల్‌గా చెప్పాలంటే మెదడు యొక్క దిగువ భాగం పుర్రె దాటి విస్తరించి, పుర్రె వెన్నుపాముతో కలిసే ద్వారం పొడుచుకు వచ్చే పరిస్థితి. ఇది సాధారణంగా పుట్టుకకు ముందు అభివృద్ధి చెందుతుందని వైద్యులు.
ఈ సమస్యల ప్రతి 2,000 మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. అయితే ఈ పరిస్థితి ఎందువల్ల వస్తుందనేది ఖచ్చితమైన కారణం తెలియదు. అయితే పెద్దవాళ్లైన ముగ్గురు ఆడపిల్లలు అమేలియా, ఆబ్రే, అడాలీలకి పీడియాట్రిక్ న్యూరో సర్జన్ శస్త్ర చికిత్స చేసి సమస్య నుంచి మెరుగయ్యేలా చేశారు. ఇక్కడ వైద్యులు ఈ పరిస్థితికి..మెదడుతో కుదించి ముడిపడి ఉన్న వెన్నుపాములను కోసి సెరెబ్రోస్పానియల్ ద్రవ ప్రవాహాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా శస్త్రచికిత్స చేస్తారు.
ప్రస్తుతం ఆ ముగ్గురు ఈ సమస్య నుంచి విజయవంతంగా బయటపడ్డారు. కానీ ఇలా ఈ చియారీ వైకల్యం బారిన నలుగురు అక్కాచెల్లెళ్లు ఒకేసారిపడటం అనేది అత్యంత అసాధారణం, అరుదుగా పేర్కొన్నారు వైద్యులు. ఈ సమస్య సుమారు 10% వరకు వంశపారంపర్యంగా వస్తున్నట్లు భావిస్తున్నప్పటికీ..జన్యుపరమైన కారణాల వల్ల సంభవిస్తుందనేది మరికొందరు నిపుణులు వాదన.
చివరగా.. ఈ సమస్యకు గనుక సకాలంలో చికిత్స తీసుకోకపోతే అవయవాల బలహీనత, శ్వాస సమస్యలు, పార్శ్వగూని, తలనొప్పి, నరాల నొప్పికి దారితీసి పక్షవాతానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
(చదవండి: రోబోటిక్‌తో..స్ట్రోక్ శరవేగంగా రికవరీ)


