సమ్‌థింగ్ స్పెషల్
పిల్లలు తమ కంటే మెరుగైన జీవితం గడపాలని కలలు కంటారు తల్లిదండ్రులు. అందుకోసం ప్రతిక్షణం కష్టపడతారు. ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది... స్విగ్గీ డెలివరీ పార్ట్‌నర్ ఒకరు ఒక బిల్డింగ్ లిఫ్ట్ దగ్గర కూర్చొని ఉన్నాడు. తనతోపాటు కూతురు కూడా ఉంది. ఆ చిట్టితల్లికి తండ్రి ఓపికగా పాఠం చెబుతున్న వీడియో నెటిజనులను కదిలించింది. బహుశా ఆ వ్యక్తి భార్య వేరే ఉద్యోగం ఏదైనా చేస్తూ ఉండవచ్చు.
పాపను తనతోపాటు తీసుకువెళ్లే అవకాశం ఆమెకు లేక΄ోయి ఉండవచ్చు. దీంతో ప్రతి స్విగ్గీ డెలివరీకి కూతురుని వెంట తీసుకువెళుతుంటాడు. ఏ మాత్రం విరామం దొరికినా ఇలా పాఠాలు చెబుతుంటాడు. ‘స్విగ్గీ డాడీ’ ‘రియల్ హీరో’ అంటూ ఆ స్విగ్గీ ఉద్యోగిని ఆశానికెత్తారు నెటిజనులు. ‘చాలామంది తండ్రులు ఉద్యోగం నుంచి ఇంటికి రాగానే ఫోన్‌లో మునిగి΄ోయి పిల్లల చదువును పట్టించుకోరు. చదివించాల్సిన బాధ్యత తల్లిదే అన్నట్లుగా ఉంటుంది వారి ధోరణి. అలాంటి తండ్రులకు ఈ రియల్ హీరో మోడల్ కావాలి. తనకు ఉన్న పరిమితులలోనే పాపను చదివిస్తున్న తీరు అభినందనీయం’ అన్నారు.


