నారాయణ ఎన్నికల కు‘తంత్రం’  | Sakshi
Sakshi News home page

నారాయణ ఎన్నికల కు‘తంత్రం’ 

Published Sun, Feb 4 2024 4:29 AM

Phone calls from Narayana Education Institute to parents of students: andhra pradesh - Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘హలో గుడ్‌ ఈవినింగ్‌. నేను నారాయణ విద్యాసంస్థల నుంచి ఫోన్‌ చేస్తున్నాను. మీ అబ్బాయి మా స్కూల్‌లో చదువుతున్నాడు కదా. మీ కుటుంబం గురించి కొన్ని వివరాలు కావాలి. మీరు నివాసం ఉంటున్నది ఎక్కడ. ఏ డివిజన్‌లో మీ ఇల్లు ఉంది. మీ ఇంట్లో ఓటర్లు ఎంత మంది? పోలింగ్‌ బూత్, ఓటరు ఐడీ నంబర్లు చెప్పండి. చివరగా మీ బ్యాంకు అకౌంట్‌ నంబరు చెప్పండి’ ఇవీ నెల్లూరు నారాయణ విద్యాసంస్థల నుంచి వచ్చే ఫోన్‌ కాల్‌లో అడుగుతున్న వివరాలు. ఆ విద్యాసంస్థల్లోని ఉద్యోగులు కొన్ని రోజులుగా ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.  

రాజకీయ కేంద్రాలుగా విద్యాసంస్థలు 
2019 ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి పోటీచేసి ఓటమి చెందిన పొంగూరు నారాయణ ఈ దఫా కూడా పోటీకి సిద్ధమయ్యారు. స్థానికంగా విద్యాసంస్థల్నే తన రాజకీయ కార్యకలాపాలకు కేంద్రాలుగా మార్చేసుకున్నారు. అక్కడ పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఎన్నికల టీంగా ఏర్పాటు చేసుకుని రాజకీయ వ్యవహారాలు నడిపిస్తున్నారు. గతంలో ఆ ఉద్యోగులు ఓటర్ల వ్యక్తిగత డేటా సేకరణ చేస్తూ పట్టుబడి స్థానికుల చేత తన్నులు తిని పోలీస్‌స్టేషన్‌లో పంచాయితీ వర­కు వెళ్లాల్సి వచి్చంది. నెల జీతం కోసం పనిచేసే ఉద్యోగులను స్థానికుల చేతిలో చావుదెబ్బలు తినాల్సిన పరిస్థితికి నారాయణ తీసుకువచ్చారు.

దీనిపై గతంలో పెద్ద దుమారమే రేగింది.  మరోసారి విద్యార్థుల కుటుంబాల సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. నెల్లూరు నగరంలో దాదాపు 12 వేల మంది విద్యార్థులు నారాయణ విద్యాసంస్థల్లో  చదువుకుంటున్నారు. ఆయా విద్యార్థుల కుటుంబ సభ్యు­ల ఓట్ల కోసం గాలం వేసేందుకు సమాచారం సేక­రించే పనిలో ఉద్యోగులు ప్రస్తుతం బిజీగా ఉన్నా­రు. 2019 ఎన్నికల్లో తాను నమ్మిన వాళ్లే ఓటుకు నోటు సక్రమంగా చేర్చలేదన్న అభిప్రాయంతో ఉన్న నారాయణ ఈ దఫా వారిని నమ్మకుండా ఓటర్ల బ్యాంకు ఖాతాను సేకరించి వారి ఖాతాలోకే నోటు చే­ర్చేలా పథకం రచించారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. 

ఐదేళ్లగా ముఖం చాటేసి.. 
నెల్లూరు నగర నియోజకవర్గంలో టీడీపీ జెండా మోసి పార్టీ కష్టకాలంలో అండగా ఉన్న నేతలను కాదని గత ఎన్నికల్లో నారాయణ టికెట్‌ ఎగరేసుకుపోవడాన్ని ఆ పార్టీ క్యాడర్‌  జీరి్ణంచుకోలేకపోయింది. దీంతో అందరూ నారాయణకు వెన్నుపోటు పొడవడంతో ఓటమి చెందారు. ఆ తరువాత నాలుగున్నర ఏళ్ల కాలంగా నియోజకవర్గానికి ముఖం చాటేసిన నారా­యణ  ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు   అడగడంపై పార్టీ క్యాడర్‌ గుర్రుగా ఉంది.

Advertisement
 
Advertisement