
పేరెంటింగ్
పి.ఎం.ఐ (పేరెంట్ మెంటర్ ఇంటరాక్షన్ )కు సమాచారం రాగానే తల్లిదండ్రులు తమకు టీచర్లు ఏదో బాకీ ఉన్నట్టు టీచర్లను నిలదీయడానికే ఈ అవకాశం వచ్చినట్టు భావిస్తుంటారు. పి.ఎం.ఐ అనేది పిల్లలు స్కూల్లో ఎలా ఉన్నారో, చదువులో వారి అవగాహన ఎలా ఉందో, వారికి తల్లిదండ్రుల నుంచి ఎలాంటి మద్దతు కావాలో టీచర్లు తెలియచేసే ఇంటరాక్షన్ . కాబట్టి పి.ఎం.ఐ.లలో తల్లిదండ్రులు వ్యవహరించకూడని విషయాలను నిపుణులు చెప్తున్నారు. అవి ఏంటంటే...
టీచర్–పేరెంట్ మీటింగ్ అనగానే తల్లిదండ్రులు రెండు విధాలుగా ప్రవర్తిస్తారు.ఒకటి అసలు వెళ్లరు. రెండు.. వెళ్లి టీచర్‌ను అనేక ప్రశ్నలు అడగాలి, వీలైతే నిలదీయాలి అనుకుంటారు. అసలు వెళ్లకపోవడం ఎంత త΄్పో వెళ్లి టీచర్ల దగ్గర ‘గట్టిగా’ వ్యవహరించడం కూడా అంతే తప్పు. ‘మన అబ్బాయి/అమ్మాయి బుద్ధిగా చదువుకుంటోంది.
పి.ఎం.ఐకి వెళ్లి కొత్తగా తెలుసుకునేదేముంది’ అని కొంతమంది తల్లిదండ్రులు.. తీరిక లేదనే కారణంతో కొంతమందీ వెళ్లరు. బాగా చదివినంత మాత్రాన, మంచి మార్కులు వచ్చినంత మాత్రాన స్కూల్లో పిల్లలు ఎలా ఉన్నారో మనకు తెలిసేది పి.ఎం.ఐ వల్ల మాత్రమే. తల్లిదండ్రుల కంటే టీచర్లు ఎక్కువగా పిల్లలను పరిశీలిస్తారు. కాబట్టి పి.ఎం.ఐ.కి హాజరు కావడం తప్పనిసరి.
మరోవైపు పిల్లల చదువును భూతద్దంలో పెట్టి చూస్తూ, చదువుకు సంబంధించిన అన్ని లోపాలకు కారణం స్కూలు టీచర్లే అనే విధానం తో తల్లిదండ్రులు ఉంటారు. వీరు తరచూ టీచర్లకు కాల్ చేయడం, పి.ఎం.ఐ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం మోతాదు మించిన స్పందన అని చెప్పవచ్చు. నిజానికి ఇటీవల స్కూలు పాఠాలు పిల్లలను గైడ్ చేస్తూ ఇంటర్నెట్ ద్వారా మిగిలిన చదువు పూర్తి చేసుకునేలా ఉంటున్నాయి.
ఇది అర్థం చేసుకుని టీచర్లను నిందితులుగా చూడటం కంటే వారు పిల్లల గురించి చేసిన అబ్జర్వేషన్స్ ను విని అర్థం చేసుకుని కర్తవ్యాన్ని నెరవేర్చుకోవాలి. కొన్ని స్కూళ్లలో నెల, రెండు నెలలకోసారి పేరెంట్–టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తుండగా, మరికొన్ని చోట్ల క్వార్టర్లీ/ హాఫ్ ఇయర్లీ పరీక్షలు అయ్యాక నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో అటు టీచర్లు, ఇటు తల్లిదండ్రులు కొన్ని తప్పులు చేస్తున్నారని నిపుణులు అంటున్నారు.
అమ్మానాన్నలూ.. ఇలా చేయొద్దు
→ కొన్ని ఇళ్లల్లో తల్లి మాత్రమే పేరెంట్–టీచర్స్ మీటింగ్‌కు హాజరవుతుంటుంది. దాంతో తన విషయాలేవీ తండ్రికి తెలియవనే ధీమాతో పిల్లలు ఉంటారు. అప్పుడప్పుడూ నాన్న కూడా మీటింగ్‌కు వెళ్లాలి. వెళ్లడం కుదరకపోతే టీచర్లతో మాట్లాడి పిల్లల గురించి కనుక్కోవాలి.
→ పి.ఎం.ఐలలో పిల్లల మార్కులను, వారి ప్రతిభను ఇతరులతో పోలుస్తూ మాట్లాడుతుంటారు కొందరు తల్లిదండ్రులు. క్లాసులో తమ పిల్లలే ఫస్ట్ రావాలని అంటుంటారు. అలా కాకుండా పిల్లల సమస్య ఏమిటో కనుక్కోవాలి. కేవలం మార్కుల గురించే కాకుండా ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లల భాగస్వామ్యం గురించి కూడా కనుక్కోవాలి.
→ తల్లిదండ్రులు టీచర్లతో మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మౌనంగా నిలబడి ఉంటారు. అలా కాకుండా, వారిని కూడా మీ సంభాషణల్లో భాగస్వామిని చేస్తే స్వేచ్ఛగా వారి విషయాలు మీతో పంచుకుంటారు.
→ తమ పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో ఎక్కువసేపు ఉంటున్నారనే అనుమానాలని టీనేజ్ పిల్లల తల్లిదండ్రులు పిల్లల ముందు కాకుండా టీచర్లతో విడిగా మాట్లాడటం మేలు.
→ క్లాసుల్లో పిల్లలు అల్లరి చేయడం, జట్లు కట్టి టీచర్లను కామెంట్ చేయడం చేస్తున్నారని టీచర్లు చెప్పినప్పుడు కొందరు ‘మా పిల్లలే అల్లరి చేస్తున్నారా’ అని ఎదురు ప్రశ్నిస్తారు. దాంతో టీచర్లు మీ పిల్లల ప్రవర్తనా దోషాలు చెప్పడం మానేస్తారు.
టీచర్లూ..ఈ సూచనలు మీకు
→ కొంతమంది టీచర్లు పిల్లల ప్రవర్తనలో కనిపించిన చిన్న చిన్న లోపాల్ని పెద్దవి చేసి తల్లిదండ్రులకు చెప్తుంటారు. దీనివల్ల వారిలో ఆందోళన పెరుగుతుంది. ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఇలా చేయడం సరికాదు. ఫిర్యాదుల్లా కాకుండా, ‘ఈ ప్రవర్తన మారితే మీ పిల్లలు మరింత రాణించగలరు’ అనే పద్ధతిలో చె΄్పాలి.
→ పిల్లల చదువుతోపాటు వారికి ఇంకే రంగంపై ఆసక్తి ఉంది, అందులో రాణిస్తే ఎలా ఉంటుందనే అంశాలను కూడా టీచర్లు తల్లిదండ్రులతో చర్చించొచ్చు.
→ పిల్లల తల్లిదండ్రులందరికీ సమానమైన గౌరవం ఇవ్వాలి. వారి ఆహార్యాన్ని, మాటల్ని, ఆర్థిక స్థితిని బట్టి వేర్వేరుగా చూడటం తగదు.
→ కేవలం ఫిర్యాదు చేయడానికే కాకుండా, పిల్లల్ని మెచ్చుకునేందుకూ సమయం కేటాయించాలి. వారి చిన్న చిన్న విజయాలనూ ΄÷గడాలి. తద్వారా వారిలో, వారి తల్లిదండ్రుల్లో నమ్మకం పెరుగుతుంది.