కేర్ కేర్‌మని ఏడుస్తున్న బుజ్జి పాపాయిని తల్లి తన పొత్తిళ్లలోకి తీసుకోగానే క్షణాలలో ఏడుపు ఆపేసి హాయిగా కేరింతలు కొట్టడం మనకు తెలిసిందే. పాపాయి ఏడుపు మానడానికి తల్లి స్పర్శే ప్రధాన కారణం. ఏడుపు ఆపడానికే కాదు, బిడ్డ ఎదుగుదలలో తల్లిదండ్రుల స్పర్శదే ప్రముఖ పాత్ర అని పరిశోధకులు చెబుతున్నారు.
తల్లిదండ్రులు ఇచ్చే వెచ్చని స్పర్శ నార్మల్‌గా పుట్టిన బిడ్డలతోపాటు నెలలు నిండక ముందే జన్మించిన ప్రీమెచ్యూర్డ్ శిశువుల మెదడు అభివృద్ధికి మరింత కీలకమని తాజా అధ్యయనం తేల్చింది. 32 వారాల కంటే ముందు జన్మించిన శిశువులను ఇన్ఫెక్షన్లేవీ సోకకుండా ఇంక్యుబేటర్‌లో పెట్టడం సాధారణం. అయితే అలాంటి పిల్లలకు కూడా తల్లి లేదా తండ్రి కంగారూ కేర్ అంటే బిడ్డ శరీరాన్ని మృదువుగా తాకుతూ ఉంటే, వారి మెదడులో ముఖ్యమైన భాగాలు బలంగా అభివృద్ధి చెందుతున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. దీనికి కారణం ఏమిటంటే, తల్లి గర్భాశయంలో స్పర్శ అనేది మొదటగా అభివృద్ధి చెందే ఇంద్రియమే కాబట్టి. మనం పెద్దయ్యాక మసకబారే చివరి ఇంద్రియ వ్యవస్థ కూడా స్పర్శే.
అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్, ఆటిజం, డౌన్ సిండ్రోమ్, స్కిన్ అలర్జీ, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలలో స్పర్శ చూపే సానుకూల ప్రభావాలు గుర్తించబడ్డాయి. నిజానికి అమ్మానాన్నలు ముఖ్యంగా మాతృస్పర్శ పొందిన పిల్లలకు ఆటిజంపాళ్లు తక్కువగా ఉంటాయని, ఒకవేళ ఆటిజం ఉన్న పిల్లలే అయితే వారికి తల్లి స్పర్శ, మృదువైన మసాజ్ వల్ల వారిలోని మెదడు ఎదుగుదల లోపాలు ఉపశమించి వారిలోని దూకుడు స్వభావం తగ్గుతుందని నియోనేటల్ కేర్ నిపుణులు, చైల్డ్ సైకియాట్రిస్టులు చెబుతున్నారు. వీరితోపాటు డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే మసాజ్ థెరపీ వల్ల వారి కండరాల పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఆటిజం ఉన్న పిల్లలకు మెదడులోని న్యూరాన్లు అభివృద్ది చెందుతాయని పరిశోధనలలో తేలింది. జీవితంలోని ప్రారంభ దశలలో తమ పిల్లలతో బంధం ఏర్పరచుకోలేకపోయిన తల్లిదండ్రులు ఈ విషయాన్ని తెలుసుకుని తమ బిడ్డలకు క్రమం తప్పకుండా తమ స్పర్శను ఇవ్వడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయని ఆశించవచ్చు.
(రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్)
ఒక భారతీయ తల్లి స్పర్శ
ఇది కేవలం భారతీయ తల్లులకే పరిమితం కాకపోయినా, మన సంస్కృతిలో చంటిపిల్లలను తల్లి లేదా అమ్మమ్మ నానమ్మ వంటి వారు వెన్ను తడుతూ జోలపాడితే చాలు క్షణాలలోనే గాఢమైన నిద్రలోకి జారుకోవడం అందరికీ తెలిసిందే. చిన్నారులలో సంభాషణ తీరు మెరుగుపడటానికి, మెదడు ఆరోగ్యకర మైన పనితీరుకు, శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల సమతుల్యతకు, శారీరక, భావోద్వేగ శ్రేయస్సుకు స్పర్శ చాలా ముఖ్యమైనది. ప్రేమను అందించడంలోనే కాదు, ప్రేమను పొందడంలో కూడా స్పర్శ ఎంతో తోడ్పడుతుంది.
కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్) వంటి ఇతర న్యూరోకెమికల్స్‌కు ప్రతిస్పందనగా మెదడు కూడా అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్య కరమైన పనితీరుకు సాధారణ స్థాయి కార్టిసాల్ అవసరం అయినప్పటికీ, స్పర్శ లోపం ఉన్న శిశువులు పెరిగే కొద్దీ వారి భావోద్వేగాలను, ప్రవర్తనను నియంత్రించడంలో తగినంత కార్టిసాల్ ఉత్పత్తి కాక పిల్లలు ఇబ్బంది పడవచ్చు. అందువల్ల తల్లిదండ్రులు నవజాత శిశువులతో శారీరక అనుబంధాన్ని కలిగి ఉండటం వారి మెదడు ఎదుగుదలకు తద్వారా మానసిక అభివృద్ధికి చాలా అవసరం.
చదవండి: ఇషా, ఆకాష్ అంబానీ బర్త్‌డే: తరలి వెళ్లిన తారలు


