Sakshi News home page

కొడుక్కు తుపాకీ అందుబాటులో ఉంచారని... తల్లిదండ్రులకు 15 ఏళ్ల జైలు

Published Thu, Apr 11 2024 5:57 AM

Judge Locks Up Oxford High School Shooter Parents - Sakshi

వాషింగ్టన్‌:  కొడుకు చేసిన నేరానికి తల్లిదండ్రులకు శిక్ష విధించిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. స్కూల్‌లో తుపాకీతో కాల్పులు జరిపిన నలుగురు పిల్లలను బలి తీసుకోవడంతో పాటు ఏడుగురిని గాయపర్చిన బాలుడి తల్లిదండ్రులకు కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

ఇంట్లో బాలుడికి తుపాకీ అందుబాటులో ఉండేలా పెట్టడమే వారి నేరమని నిర్ధారించింది. 2021 నవంబర్‌ 30న మిషిగన్‌ రాష్ట్రంలోని ఆక్స్‌ఫర్డ్‌ హైసూ్కల్‌లో ఎథాన్‌ క్రంబ్లీ అనే పిల్లాడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అతని మానసిక ఆరోగ్యం సరిగా లేదని తేలింది. అలాంటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సింది పోయి తుపాకీ అందుబాటులో ఉంచడం తల్లిదండ్రులు జేమ్స్, జెన్నిఫర్‌ తప్పేనని కోర్టు తేల్చింది.
 

Advertisement

What’s your opinion

Advertisement